బాహుబలిని వదిలించు కోవాలనుకున్నాడు
బాహుబలి లాంటి సినిమాను ఎవరు వదులుకుంటారు చెప్పండి…. ప్రతిష్టాత్మకమైన అలాంటి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి మరీ చేస్తారు. కానీ స్వయానా రాజమౌళే ఈ ప్రాజెక్టును వదులుకోవాలని అనుకున్నాడట. ఇది రూమర్ కాదు. అచ్చంగా నిప్పులాంటి నిజం. స్వయంగా ఈ విషయాన్ని హీరో ప్రభాస్ వెల్లడించాడు. బాహుబలి సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత… బడ్జెట్ లెక్కలేసిన రాజమౌళి… ఊహించని ఎమౌంట్ లెక్కతేలడంతో…. సెట్స్ పైకి వెళ్లకముందే బాహుబలి ప్రాజెక్టు నుంచి పక్కకు వచ్చేయాలని అనుకున్నాడట. […]
BY admin15 Feb 2016 2:43 AM IST
X
admin Updated On: 15 Feb 2016 6:47 AM IST
బాహుబలి లాంటి సినిమాను ఎవరు వదులుకుంటారు చెప్పండి…. ప్రతిష్టాత్మకమైన అలాంటి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి మరీ చేస్తారు. కానీ స్వయానా రాజమౌళే ఈ ప్రాజెక్టును వదులుకోవాలని అనుకున్నాడట. ఇది రూమర్ కాదు. అచ్చంగా నిప్పులాంటి నిజం. స్వయంగా ఈ విషయాన్ని హీరో ప్రభాస్ వెల్లడించాడు. బాహుబలి సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత… బడ్జెట్ లెక్కలేసిన రాజమౌళి… ఊహించని ఎమౌంట్ లెక్కతేలడంతో…. సెట్స్ పైకి వెళ్లకముందే బాహుబలి ప్రాజెక్టు నుంచి పక్కకు వచ్చేయాలని అనుకున్నాడట. కానీ నిర్మాతలు ఇచ్చిన ఉత్సాహంతో బాహుబలి సినిమాను తెరపైకి తెచ్చాడని ప్రభాస్ వెల్లడించాడు. ఒక విధంగా సినిమాను రెండు ముక్కలు చేయడానికి కూడా ఇదే కారణమనే విషయాన్ని ప్రభాస్ చెప్పకపోయినప్పటికీ…. అతడి మాటల్లో ఆ అర్థం కనిపించింది. గామా అవార్డుల వేడుకల్లో మాట్లాడుతూ…. ఈ విషయాలు బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా తమన్న కూడా సెట్స్ పైకి వచ్చి చేరింది.
Next Story