అమెరికా అత్యున్నత పదవిలో ఓ భారతీయుడు!
అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి అవకాశం లభించనుంది. ఆ పదవిలో ఉన్నజస్టిస్ ఆంటోనిస్ స్కాలియా మృతి చెందడంతో ఆ స్థానంలో బరాక్ ఒబామా మరొక న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది. ఈ అవకాశం భారత సంతతికి చెందిన శ్రీకాంత్ శ్రీనివాసన్‌కి లభించనున్నదని తెలుస్తోంది. సంప్రదాయవాది అయిన జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) టెక్సాస్ పర్యటనలో ఉండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాంతో శ్రీకాంత్ శ్రీనివాసన్ పేరు తెరపైకి వచ్చింది. స్కాలియా […]

అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి అవకాశం లభించనుంది. ఆ పదవిలో ఉన్నజస్టిస్ ఆంటోనిస్ స్కాలియా మృతి చెందడంతో ఆ స్థానంలో బరాక్ ఒబామా మరొక న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది. ఈ అవకాశం భారత సంతతికి చెందిన శ్రీకాంత్ శ్రీనివాసన్‌కి లభించనున్నదని తెలుస్తోంది. సంప్రదాయవాది అయిన జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) టెక్సాస్ పర్యటనలో ఉండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాంతో శ్రీకాంత్ శ్రీనివాసన్ పేరు తెరపైకి వచ్చింది. స్కాలియా అంతటి స్థాయి వ్యక్తినే ఆ స్థానంలోకి తీసుకోనున్నట్టుగా ఒబామా ప్రకటించారు. అయితే మరికొద్దిరోజుల్లో ఒబామా పదవీకాలం ముగియనుండగా ఆయన తన తరువాత వచ్చే నాయకుడికి ఈ నియామకం అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు కోరుతున్నారు. అందుకు ఒబామా సుముఖంగా లేరు. దాంతో శ్రీనివాసన్ ఎంపిక ఖాయమని తెలుస్తోంది.
49 ఏళ్ల శ్రీనివాసన్ తల్లి దండ్రులు, ఆయన చిన్నతనంలోనే తమిళనాడులోని తిరునల్‌వెల్లి గ్రామం నుండి వెళ్లి, అమెరికాలో స్థిరపడ్డారు. 1989లో న్యాయవాద పట్టా తీసుకున్న శ్రీనివాసన్ గతంలో ఒబామాకు ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2013లో అమెరికాలోని రెండో అత్యున్నత న్యాయస్థానం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని చేపడితే అ అవకాశం దక్కిన మొట్టమొదట భారతీయుడు అవుతారు. ఒబామా నామినీల రేసులో ఈయనే ముందున్నట్టుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది.