సంక్రాంతికి నాలుగు... సమ్మర్ కు మరో నాలుగు
ఈ సంక్రాంతికి సిసలైన పోటీచూశాం. ఏకంగా 4 సినిమాలు పోటీపడ్డాయి. జయాపజయాలు పక్కనపెడితే సినిమాలన్నీ ఆ సీజన్ ను బాగానే క్యాష్ చేసుకున్నాయి. ఫ్లాప్ అయిన డిక్టేటర్ కు కూడా డబ్బులొచ్చాయంటే అది సంక్రాంతి మహత్యమే. ఇక అలాంటి సీజనే సమ్మర్ లో కూడా ఉంది. సమ్మర్ కు వచ్చిన సినిమాలేవీ ఫెయిలైన దాఖలాల్లేవ్. ఒకవేళ ఫ్లాప్ అయినా డబ్బులకు ఢోకా ఉండదు. అందుకే ఈసారి సంక్రాంతిలానే సమ్మర్ కు కూడా నాలుగు సినిమాలు సిద్ధమైపోతున్నాయి. పవర్ […]
BY admin14 Feb 2016 9:18 PM GMT
X
admin Updated On: 15 Feb 2016 1:16 AM GMT
ఈ సంక్రాంతికి సిసలైన పోటీచూశాం. ఏకంగా 4 సినిమాలు పోటీపడ్డాయి. జయాపజయాలు పక్కనపెడితే సినిమాలన్నీ ఆ సీజన్ ను బాగానే క్యాష్ చేసుకున్నాయి. ఫ్లాప్ అయిన డిక్టేటర్ కు కూడా డబ్బులొచ్చాయంటే అది సంక్రాంతి మహత్యమే. ఇక అలాంటి సీజనే సమ్మర్ లో కూడా ఉంది. సమ్మర్ కు వచ్చిన సినిమాలేవీ ఫెయిలైన దాఖలాల్లేవ్. ఒకవేళ ఫ్లాప్ అయినా డబ్బులకు ఢోకా ఉండదు. అందుకే ఈసారి సంక్రాంతిలానే సమ్మర్ కు కూడా నాలుగు సినిమాలు సిద్ధమైపోతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్… తన ప్రెస్టీజియస్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను సమ్మర్ లోనే బరిలోకి దించుతున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇక బన్నీ కూడా సరైనోడుగా తయారయ్యాడు. ఈ సినిమాను పవన్ సినిమాకు అటు ఇటుగా విడుదల చేస్తారు. వీటితో పాటు మహేష్ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం కూడా సమ్మర్ ఎట్రాక్షన్ గానే బరిలోకి రాబోతోంది. పవన్, బన్నీ సినిమాలు వచ్చిన తర్వాత నెక్ట్స్ క్యూలో ఉన్నది ఈ సినిమానే. ఈ 3 బడా సినిమాల మధ్యలో నాగచైతన్య కూడా సాహసం శ్వాసగా సాగిపో అంటూ తెగించడానికి సిద్ధపడ్డాడు.
గమ్మత్తయిన విషయం ఏంటంటే… సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోల మధ్య శర్వానంద్ లాంటి చిన్న హీరో వచ్చి పోటీపడ్డాడు. ఈసారి సమ్మర్ కు కూడా అదే సీన్. ముగ్గురు బడా హీరోల మధ్య నాగచైతన్య లాంటి చిన్న హీరో వచ్చి రేసుకు సై అంటున్నాడు. శర్వానంద్ లానే చైతూ కూడా చాపకింద నీరులా హిట్ కొట్టేస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.
Next Story