తెలుగు బీజేపీ వర్సెస్ తెలంగాణ బీజేపీ
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు రెండు రకాలుగా ఉన్నారని తొలి నుంచి ఒక భావన ఉంది. ఒక వర్గం కమలనాథులు టీడీపీ వల్లే బీజేపీ కనీసం ఈ స్థాయిలో ఉందని ప్రచారం చేస్తుంటారు. అంటే వారికి టీడీపీ అంటే బాగా ఇష్టం. మరో వర్గం కమలనాథులు మాత్రం ఎన్ని రోజులు ఇలా టీడీపీకి తోక పార్టీగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సొంతంగా ఎదిగే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఈ రెండు కమల దళాల మధ్య పోరు […]
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు రెండు రకాలుగా ఉన్నారని తొలి నుంచి ఒక భావన ఉంది. ఒక వర్గం కమలనాథులు టీడీపీ వల్లే బీజేపీ కనీసం ఈ స్థాయిలో ఉందని ప్రచారం చేస్తుంటారు. అంటే వారికి టీడీపీ అంటే బాగా ఇష్టం. మరో వర్గం కమలనాథులు మాత్రం ఎన్ని రోజులు ఇలా టీడీపీకి తోక పార్టీగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సొంతంగా ఎదిగే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఈ రెండు కమల దళాల మధ్య పోరు మొదలైంది.
తెలంగాణ వేదికగా ఈ అంతర్గత పోరు మొదలైంది. వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి ఘోరంగా బీజేపీ కూడా దెబ్బతిన్న నేపథ్యంలో తెలుగుదేశంతో దోస్తిని వ్యతిరేకిస్తూ వచ్చిన వర్గానికి బలం రెట్టింపైంది. గ్రేటర్‌లో సెటిలర్లు కూడా టీడీపీకి హ్యాండివ్వడంతో ఇదే అదనుగా బాబు పార్టీ బరువును దించుకోవాలని ఆ వర్గం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేత టీడీపీతో దోస్తీని వెంటనే వదులుకోవాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. సెటిలర్లు ఉన్న ప్రాంతంలోనూ చిత్తుచిత్తుగా ఓడిన టీడీపీతో స్నేహం వల్ల వచ్చే లాభం ఏమిటని సదరు నేత సూటిగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ ఎప్పటికీ తోక పార్టీగానే మిగిలిపోతోందన్న భావనతో ఉన్న మిగిలిన కమలనాథులు కూడా సదరు కీలక నేతకు బాసటగా నిలుస్తున్నారు.
టీడీపీతో దోస్తి తెంచుకుంటే వచ్చే ఉపయోగాలను కూడా ఢిల్లీ బీజేపీ నేతలకు వివరిస్తున్నారు. బీజేపీతో స్నేహం చేసేందుకు టీఆర్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే టీడీపీతో మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్లే కారు పార్టీ దూరంగా ఉందని చెబుతున్నారు. టీడీపీతో దోస్తానాకు ముగింపు పలికిన మరుక్షణం టీఆర్‌ఎస్ బీజేపీకి స్నేహహస్తం చాచేందుకు సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా తెలంగాణలో టీడీపీ దోస్తికి కటీఫ్ చెప్పి కారెక్కితే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా బీజేపీ పరువు నిలుస్తుందని కోరుతున్నారు.ఆలస్యం చేస్తే బీజేపీకి ఉన్న సాంప్రదాయక ఓటు బ్యాంకు కూడా దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదన పట్ల బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగానే స్పందించినట్టు చెబుతున్నారు.
అదే సమయంలో బీజేపీలో ఉన్న కొందరు టీడీపీ అభిమానకమలనాథులు మాత్రం ఈ పరిణామంపై కంగారుపడుతున్నారని సమాచారం. అయితే టీడీపీతో కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను వీరు స్పష్టంగా వివరించలేకపోతున్నారు. కాకపోతే టీడీపీతో సుధీర్ఘంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ దాన్ని కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నారు. పైగా టీడీపీ ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఇకపై ఎప్పుడూ గెలవదని చెప్పడం కూడా సరికాదని టీడీపీ తరపున వాదిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా లాబీయింగ్‌లో కేంద్రమంత్రి వెంకయ్య కీలక పాత్ర పోషిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
అయితే టీడీపీ అనుకూల బీజేపీ నేతల వాదన ఢిల్లీలో నిలవడం లేదని చెబుతున్నారు. 2019లోనూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే పైచేయి అవుతుందన్న అంచనాకు ఢిల్లీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు. అందుకే టీఆర్ఎస్‌ను కేంద్ర కేబినెట్‌లో చేర్చుకునేందుకు మోదీ కూడా సిద్ధమవుతున్నారని అంటున్నారు. మొత్తం మీద త్వరలోనే తెలంగాణ బీజేపీ… టీడీపీ నుంచి బయటపడడం ఖాయమని చెబుతున్నారు.
Click on Image to Read: