ఫేస్‌బుక్ పరిచయం...ప్రాణం తీసింది
ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని ఆమె ఇంట్లోనే కలుసుకుని, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక యువకుడు. ఈశ్వర్ అలియాస్ నిషాంత్ అనే ఆ యువకుడి వయసు 27ఏళ్లు. ఢిల్లీలోని జహంగిర్ పురిలో ఒక బట్టల దుకాణం నడుపుతున్నాడు. అతనికి ఆరునెలల క్రితం ఓ 18 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. రాజస్థాన్‌కి చెందిన ఈ అమ్మాయి ఒక బ్యూటీపార్లర్‌లో పనిచేస్తోంది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ప్రేమికులరోజు ముందురోజు కలుసుకోవాలని అనుకున్నారు. సుశాంత్‌లోక్‌లో ఉన్న ఆమె ఫ్లాట్‌కి […]
ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని ఆమె ఇంట్లోనే కలుసుకుని, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక యువకుడు. ఈశ్వర్ అలియాస్ నిషాంత్ అనే ఆ యువకుడి వయసు 27ఏళ్లు. ఢిల్లీలోని జహంగిర్ పురిలో ఒక బట్టల దుకాణం నడుపుతున్నాడు. అతనికి ఆరునెలల క్రితం ఓ 18 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. రాజస్థాన్‌కి చెందిన ఈ అమ్మాయి ఒక బ్యూటీపార్లర్‌లో పనిచేస్తోంది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ప్రేమికులరోజు ముందురోజు కలుసుకోవాలని అనుకున్నారు. సుశాంత్‌లోక్‌లో ఉన్న ఆమె ఫ్లాట్‌కి అతను వచ్చాడు.
చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి ఎనిమిదిన్నర అవుతుండగా ఆ అమ్మాయి బావ, అతని స్నేహితుడు అక్కడికి వచ్చారు. ఇద్దరినీ ఒకచోట చూసి కోపంతో రెచ్చిపోయారు. ఈశ్వర్‌ని బాగా కొట్టారు. వారే అతడిని నాలుగో అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్ బాల్కనీ నుండి కిందకు తోసేశారు. ఈశ్వర్‌కి బాగా గాయాలు కావడంతో భయపడిన ఆ ఇద్దరు అతడిని ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంటులో దెబ్బలు తగిలాయని చెప్పారు. అనంతరం ఈశ్వర్ గాయలతో మరణించాడు. పోలీసుల ఇంటరాగేషన్లో ఆ అమ్మాయి అసలు నిజాలు బయటపెట్టింది. దాంతో ఆ ఇద్దరు యువకులు అనిల్, రమేష్‌లను పోలీసులు హత్య, సాక్ష్యాలు మాయం చేయడం అనే నేరాలు మోపి అరెస్టు చేశారు.
ఫేస్‌బుక్ పరిచయాన్ని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఈశ్వర్‌కి ఇంతకుముందే పెళ్లయింది. అతని పెళ్లిరోజు ఫిబ్రవరి 14 కాగా, ఒక రోజు ముందు వచ్చి ఈ అమ్మాయిని కలిశాడు.