రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు అక్రమమా? సక్రమమా?
ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మరో 9 మంది వైసీపీ కార్యకర్తలపైనా కేసు బుక్ చేశారు. అయితే కేసు నమోదుపై పోలీసుల వాదన, వైసీపీ నేతల వాదన పూర్తి భిన్నంగా ఉన్నాయి. తన తండ్రిని కొందరు కిడ్నాప్ చేశారంటూ సొసైటీ సభ్యుడు వరపుత్రుని కుమారుడు వెంకటరమణ స్వయంగా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డిని ఆశ్రయించారని, కానీ […]
ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మరో 9 మంది వైసీపీ కార్యకర్తలపైనా కేసు బుక్ చేశారు. అయితే కేసు నమోదుపై పోలీసుల వాదన, వైసీపీ నేతల వాదన పూర్తి భిన్నంగా ఉన్నాయి.
తన తండ్రిని కొందరు కిడ్నాప్ చేశారంటూ సొసైటీ సభ్యుడు వరపుత్రుని కుమారుడు వెంకటరమణ స్వయంగా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డిని ఆశ్రయించారని, కానీ పోలీసులు మాత్రం కేసును తప్పుదారి పట్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంకటరమణను టీడీపీ నేతలు కొందరు బెదిరించి రవీంద్రనాథ్ రెడ్డిపైనే కేసు పెట్టేలా చేశారని అంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలే తమ తండ్రి వరపుత్రుడిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కొడుకు వెంకటరమణతో టీడీపీ నాయకులు కేసు పెట్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరి వాదన నిజమన్నది పూర్తి వివరాలు ఆయన బయటకు వస్తే తెలిసే అవకాశం ఉంది.
Click on Image to Read: