తమిళనాడులో ఇక అమ్మా డ్రింకింగ్ వాటర్!
జయలలిత పేరుతో తమిళనాడులో పాపులర్ పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ వరుసలో ప్యూరిఫై చేసిన మంచినీటి పథకం కూడా చేరింది. డబ్బున్నవారు శుద్ధిచేసిన మంచినీళ్లను ఎంత ధరపెట్టి అయినా కొనుక్కుంటారు. కానీ పేదవాళ్లకు ఆ నీటిని కొనే స్థోమత ఉండదు. అలాంటివారికోసం అమ్మా కుడినీర్ తిట్టం అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా జయలలిత ప్రకటించారు. గ్రేటర్ చైన్నై కార్పొరేషన్ పరిధిలో ఎక్కువమంది పేదలు నివసించే 100 ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో ప్యూరిఫై […]
జయలలిత పేరుతో తమిళనాడులో పాపులర్ పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ వరుసలో ప్యూరిఫై చేసిన మంచినీటి పథకం కూడా చేరింది. డబ్బున్నవారు శుద్ధిచేసిన మంచినీళ్లను ఎంత ధరపెట్టి అయినా కొనుక్కుంటారు. కానీ పేదవాళ్లకు ఆ నీటిని కొనే స్థోమత ఉండదు. అలాంటివారికోసం అమ్మా కుడినీర్ తిట్టం అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా జయలలిత ప్రకటించారు. గ్రేటర్ చైన్నై కార్పొరేషన్ పరిధిలో ఎక్కువమంది పేదలు నివసించే 100 ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో ప్యూరిఫై చేసిన నీటిని సరఫరా చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తారు. తరువాత మరికొన్ని ప్రాంతాలకూ ఈ పథకాన్ని విస్తరిస్తారు. ఒక్కో ఇంటికి 20లీటర్ల చొప్పున నీరు అందజేస్తారు. లబ్దిదారులు నీటిని లెక్క ప్రకారం, సులువుగా పొందేందుకు వీలుగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడతారు.