ఓటుకు నోటు- ఆయన అరెస్ట్ తప్పదా ?
కొద్దికాలంగా సోదిలో లేకుండా పోయిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను విజయవంతంగా కారెక్కించుకున్న టీఆర్‌ఎస్ మిగిలిన ఎమ్మెల్యేల టార్గెట్‌గానే ఓటుకు నోటును మరోసారి కదిలించినట్టు తెలుస్తోంది. కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం వెనుక అసలు టార్గెట్ వేరే ఉందని చెబుతున్నారు. వారంలోగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఉప్పల్‌లోని మత్తయ్య ఇంటికి వెళ్లి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. […]
కొద్దికాలంగా సోదిలో లేకుండా పోయిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను విజయవంతంగా కారెక్కించుకున్న టీఆర్‌ఎస్ మిగిలిన ఎమ్మెల్యేల టార్గెట్‌గానే ఓటుకు నోటును మరోసారి కదిలించినట్టు తెలుస్తోంది. కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం వెనుక అసలు టార్గెట్ వేరే ఉందని చెబుతున్నారు. వారంలోగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఉప్పల్‌లోని మత్తయ్య ఇంటికి వెళ్లి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు.
మత్తయ్య ద్వారా కేసును మరోసారి కదిలించి అతి త్వరలోనే జూబ్లిహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేస్తుందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం గోపినాథ్ వర్గంలో ఆందోళన కలిగిస్తోంది. టీటీడీపీకి చెందిన మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది టీఆర్‌ఎస్‌లో చేరగా మిగిలింది ఐదుగురే. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుకున్నారు. ఇప్పుడు ఎటొచ్చి గోపినాథే టార్గెట్. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉండడంతో గోపినాథ్ టీఆర్ఎస్‌కు ఈజీ టార్గెట్‌గా మారారని చెబుతున్నారు.
ఇప్పటికే మాగంటి గోపినాథ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరిని టీఏసీబీ పలుమార్లు విచారించింది. విచారణలో సమయంలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. రేవంత్, మాగంటి, ప్రదీప్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ టేపుల ఆధారంగా ప్రదీప్‌ను అప్పట్లో విచారించారు. ఆ సమయంలోనూ గోపినాథ్‌కు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో కేసు స్లో అయింది. కానీ ఇప్పుడు మరోసారి టీ ప్రభుత్వం ఓటుకు నోటును కదిలించడంతో హిట్ లిస్ట్‌లో ముందున్నది గోపినాథేనని చెబుతున్నారు. తొలుత నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఆ తర్వాత అవసరాన్ని బట్టి గోపినాథ్‌ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదని వార్తలొస్తున్నాయి. మొత్తం మీద టీటీడీపీలో ఓటుకు నోటు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారన్న ఫీల్ తెచ్చే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందా అన్న భావన వ్యక్తమవుతోంది.
మరోవైపు మత్తయ్య తీరు కూడా టీడీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. శనివారం మీడియాతో మాట్లాడిన మత్తయ్య కేసులో తనను ఒంటరిని చేశారని ఆవేదన చెందారు. నోటీసులు అందిన వెంటనే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. పార్టీ నాయకత్వం కూడా స్పందించడం లేదన్నారు. అడ్వకేట్ దగ్గరకు వెళ్తే మరోసారి తనవద్దకు రావద్దని అన్నారని ఆయన అసహనం వ్యక్తపరిచారు. మత్తయ్య తీరు చూస్తుంటే ఆయన అప్రూవర్‌గా మారుతారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఓటుకునోటు తమ్ముళ్లకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు.
Click on Image to Read: