అసంతృప్తి- గన్‌మెన్ లను వెనక్కి పంపిన వంశీ
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహంగా ఉన్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. ప్రజల తరపున ఆందోళన కార్యక్రమంలో పాల్గొనందుకు తనపై కేసు నమోదు చేయడాన్ని వల్లభనేని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని రైవస్ కాలువ గట్టుపై ఫైఓవర్ నిర్మాణం కోసం పలువురి ఇళ్లను అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రామవరప్పాడు వద్ద బాధితులతో కలిసి వంశీ ధర్నాలో పాల్గొన్నారు. […]
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహంగా ఉన్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. ప్రజల తరపున ఆందోళన కార్యక్రమంలో పాల్గొనందుకు తనపై కేసు నమోదు చేయడాన్ని వల్లభనేని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని రైవస్ కాలువ గట్టుపై ఫైఓవర్ నిర్మాణం కోసం పలువురి ఇళ్లను అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రామవరప్పాడు వద్ద బాధితులతో కలిసి వంశీ ధర్నాలో పాల్గొన్నారు. ఇళ్ల తొలగింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో స్థానికులతో పాటు వంశీపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తనపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వంశీ గన్‌మెన్లను వెనక్కు పంపారు.
మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినప్పుడు కేసులు నమోదు చేయని పోలీసులు… ప్రజల పక్షాన ధర్నా చేసినందుకు వంశీపై కేసు నమోదు చేయడం వివక్ష కాదా? అని వల్లభనేని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇటీవల తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన గన్‌మెన్లను వెనక్కు పంపారు.
Click on Image to Read: