ఫితూర్ ప్రేమికులను గెలిచిందా..!
పోటీగా నడిచే మార్కెట్ ప్రపంచంలో ప్రతి రోజు ఒక ప్రత్యేకమే. ఇక ప్రేమికుల రోజు అంటూ ఒక ప్రత్యేక రోజు వుంటే బిజినెస్ ఎన్ని లక్షల కోట్లలో వుంటుందో చెప్పడం కష్టం. ఇక మన దేశంలో ఇప్పటి జనరేషన్ వాలైంటెన్స్ డే ను బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే సినిమా వాళ్లు మాత్రం వాలైంటెన్స్ డే కు తమ చిత్రాల రిలీజ్ ను పెద్దగా ప్లాన్ చేసుకోరు. ఒకటి ..అర వస్తుంటాయి. అలా బాలీవుడ్ లో ఈ […]
పోటీగా నడిచే మార్కెట్ ప్రపంచంలో ప్రతి రోజు ఒక ప్రత్యేకమే. ఇక ప్రేమికుల రోజు అంటూ ఒక ప్రత్యేక రోజు వుంటే బిజినెస్ ఎన్ని లక్షల కోట్లలో వుంటుందో చెప్పడం కష్టం. ఇక మన దేశంలో ఇప్పటి జనరేషన్ వాలైంటెన్స్ డే ను బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే సినిమా వాళ్లు మాత్రం వాలైంటెన్స్ డే కు తమ చిత్రాల రిలీజ్ ను పెద్దగా ప్లాన్ చేసుకోరు. ఒకటి ..అర వస్తుంటాయి. అలా బాలీవుడ్ లో ఈ రోజు ఫితూర్ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆదిత్య కపూర్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో దర్శకుడు అభిషేక్ కపూర్ చేసిన ఫితూర్ చిత్రం ఆడియన్స్ మనస్సు కొంత వరకు గెలుచు కోగలిగింది అంటున్నారు క్రిటిక్స్. కత్రీనా , ఆదిత్య కపూర్ ప్రేమికులుగా నటించారు. సీనియర్ నటి టబు కత్రీనా కైఫ్ మదర్ గా నటించడం విశేషం. కాశ్మీర్ అందాల్ని తెర పై మరింత అందంగా చూపించారు. ఫీల్ గూడ్ లవ్ స్టోరిగా తీర్చి దిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.మొత్తం మీద ఫిబ్రవరి 14 .. కత్రీనా కైఫ్ కు కలిసొచినట్లే మరి.