సినీరంగానికి ట్యాగ్‌లైన్....వారసత్వం వర్దిల్లాలి!
సాధారణంగా సినిమా పేర్లకు కింద ట్యాగ్‌లైన్లు ఇస్తుంటారు. అలా ఈ రంగానికే ఒక ట్యాగ్‌లైన్ ఇవ్వాల్సి వస్తే…వారసత్వం వర్దిల్లాలి…అనేది బాగా సూటవుతుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు…ఇలా సినీరంగంలో ఉన్నవారి సంతానంలో చాలామంది తిరిగి ఇదే రంగంలోకి వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్నారు. రాజకీయాలు, వ్యాపారం తదితర రంగాల్లోనూ వారసులు ఉంటారు. కానీ వాటికంటే ఇది భిన్నం. టాలెంట్‌ని వారసత్వంగా పొంది పేరు తెచ్చుకోవడం అనేది సాధారణ విషయం కాదు. […]
సాధారణంగా సినిమా పేర్లకు కింద ట్యాగ్‌లైన్లు ఇస్తుంటారు. అలా ఈ రంగానికే ఒక ట్యాగ్‌లైన్ ఇవ్వాల్సి వస్తే…వారసత్వం వర్దిల్లాలి…అనేది బాగా సూటవుతుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు…ఇలా సినీరంగంలో ఉన్నవారి సంతానంలో చాలామంది తిరిగి ఇదే రంగంలోకి వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్నారు. రాజకీయాలు, వ్యాపారం తదితర రంగాల్లోనూ వారసులు ఉంటారు. కానీ వాటికంటే ఇది భిన్నం. టాలెంట్‌ని వారసత్వంగా పొంది పేరు తెచ్చుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఇప్పటికే చాలా మంది అందులో విజయాన్ని సాధించారు, సాధిస్తున్నారు.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లనుండి మొదలుపెడితే…పవన్ కల్యాణ్, మహేష్, జూ. ఎన్‌టిఆర్, నాగచైతన్య, అఖిల్, గోపీచంద్, ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, రానా, మోహన్‌బాబు పిల్లలు…ఈ వరుస చాలా పెద్దది. ఇప్పుడు మరో తరం ఎంటరవుతోంది. సినీ సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ కుమారుడు ఎఆర్ అమీన్ నిర్మలా కాన్వెంట్ సినిమాకోసం ఒక పాట పాడాడు. అది చాలా బాగా వచ్చిందని టాక్. ఇంతకుముందు ఓకే బంగారంలో కూడా అమీన్ పాట పాడాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇందులో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు కోటి కుమారుడు రోషన్ సంగీతం అందిస్తుండటం మరొక విశేషం. బాలతారగా పలుచిత్రాల్లో నటించిన శ్రేయాశర్మ హీరోయిన్. ఇకపోతే వారసులుగా రాణిస్తున్నవారిలో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్‌ని కూడా చెప్పువాలి. ఇప్పటికే నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న ఆకాష్, తండ్రి తీస్తున్న రోగ్ చిత్రానికి అసిస్టెంటు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మహేష్‌బాబు కొడుకుని కూడా తెరమీద చూశాం. ఇంకా బాలకృష్ణ కుమారుడుని కూడా త్వరలో తెరమీద చూడనున్నాం. జీవిత, రోజా కూతుళ్ల పేర్లు కూడా ఈ వరుసలో ఉన్నాయి. అందుకే ఈ రంగానికి వారసత్వం వర్దిల్లాలి అనే ట్యాగ్‌లైన్ ఇచ్చితీరాలి.