బాహుబలి చైనాలో పికెని దాటుతుందా?
బాహుబలి సినిమా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, మళయాళంలో ఇది ఊహించని విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 30దేశాల్లో ఈ సినిమా అమ్ముడుపోయింది. చైనా, జపాన్, లాటిన్ అమెరికా, జర్మనీ లాంటి దేశాలు అందులో ఉన్నాయి. చైనాలో దీన్ని మేనెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పంపిణీ సంస్థ ఈ స్టార్స్ దీన్ని విడుదల చేస్తోంది. అత్యంత ఎక్కువగా 6000ల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అమీర్‌ఖాన్ సినిమా పికె 5వేల థియేటర్లలో […]
బాహుబలి సినిమా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, మళయాళంలో ఇది ఊహించని విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 30దేశాల్లో ఈ సినిమా అమ్ముడుపోయింది. చైనా, జపాన్, లాటిన్ అమెరికా, జర్మనీ లాంటి దేశాలు అందులో ఉన్నాయి. చైనాలో దీన్ని మేనెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పంపిణీ సంస్థ ఈ స్టార్స్ దీన్ని విడుదల చేస్తోంది. అత్యంత ఎక్కువగా 6000ల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అమీర్‌ఖాన్ సినిమా పికె 5వేల థియేటర్లలో రిలీజ్ కాగా బాహుబలి దాన్ని అధిగమించింది.
చైనాలో ఇది విడుదల కావడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ సంవత్సరానికి 34 విదేశీ చిత్రాలను మాత్రమే అనుమతిస్తారు. అందులో ఎక్కువగా హాలివుడ్ చిత్రాలే ఉంటాయి. ఇప్పటివరకు చైనాలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మన సినిమాలు త్రీ ఈడియట్స్, పికె. ఇప్పుడు ప్రపంచవ్యాప్త కలెక్షన్లలో పికెని బాహుబలి అధిగమించాలంటే 118 మిలియన్ డాలర్లను మించి వసూలు చేయాల్సి ఉంటుంది. పికె, ఒక్క చైనాలోనే 20మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు పికెతో పోటీ పడాలంటే బాహుబలి చైనాలో ఇంకా ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. విడుదలవుతున్న థియేటర్ల సంఖ్య చూస్తుంటే బాహుబలి అది కూడా సాధించేట్టే ఉంది.