నేతల ఆరువేల కోట్ల అవినీతికి అధికారుల అడ్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా టీడీపీ ఎంపీ సిఎం. రమేష్ తదితర కాంట్రాక్టర్లకు పనుల అంచనా వ్యయం పెంచి ఆరువేల కోట్ల రూపాయలను దోచిపెట్టడానికి ప్రభుత్వ అధికారులు అడ్డుతగిలారు. ఆర్ధికశాఖ ఆమోదం లేకుండానే అంచనా వ్యయాలు పెంచి, ఈ ఆరువేల కోట్లలో సగానికి పైగా డబ్బును చెల్లించివేశారు కూడా. తమ అనుమతి లేకుండా కాంట్రాక్టర్లకు అక్రమంగా చెల్లించిన డబ్బుపై ఆర్ధికశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్లు, తెలుగుదేశం నాయకులు కలిసి ఈ ఆరువేల కోట్లను దోచుకోవాడానికి వేసిన పథకానికి […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా టీడీపీ ఎంపీ సిఎం. రమేష్ తదితర కాంట్రాక్టర్లకు పనుల అంచనా వ్యయం పెంచి ఆరువేల కోట్ల రూపాయలను దోచిపెట్టడానికి ప్రభుత్వ అధికారులు అడ్డుతగిలారు. ఆర్ధికశాఖ ఆమోదం లేకుండానే అంచనా వ్యయాలు పెంచి, ఈ ఆరువేల కోట్లలో సగానికి పైగా డబ్బును చెల్లించివేశారు కూడా. తమ అనుమతి లేకుండా కాంట్రాక్టర్లకు అక్రమంగా చెల్లించిన డబ్బుపై ఆర్ధికశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
కాంట్రాక్టర్లు, తెలుగుదేశం నాయకులు కలిసి ఈ ఆరువేల కోట్లను దోచుకోవాడానికి వేసిన పథకానికి అడ్డుచెప్పారు. దాంతో దొడ్డిదారిన ఈ ఆరువేలకోట్ల ఫైల్‌ను ఓకే చేసుకోవడానికి క్యాబినెట్‌లో నోట్ పెట్టి మంత్రివర్గంచేత ఆమోద ముద్ర పొందడానికి ప్రయత్నించారట. ఈ తతంగం వెనుక లోకేష్‌బాబు ఉన్నాడని తెలిసి ఈ నోట్‌ను మంత్రివర్గ సమావేశంలో ఓకే చేయించడానికి చంద్రబాబు కూడా తీవ్ర ప్రయత్నంచేశారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
అయితే ఇది హద్దులులేని అవినీతి కావడంవల్ల, భవిష్యత్తులో ఈ నోట్‌పై సంతకాలుచేసిన ప్రభుత్వ అధికారులు ఇరుక్కునే అవకాశం ఉండడంవల్ల ఆర్ధికశాఖ అధికారులు ఈ నోట్‌ను ఓకే చేయడానికి ఏమాత్రం అంగీకరించడంలేదట.
మంత్రివర్గ సమావేశానికి పంపేముందు తన అనుమతి మంజూరు చేయాల్సిన గత సీయస్ ఐ వై ఆర్ కృష్ణారావు ఈ అవినీతి వ్యవహారానికి నేను అంగీకరించనని ఈ అవినీతి నోట్‌ను మంత్రివర్గ సమావేశానికి పంపించడానికి నేను సంతకం చేయనని గట్టిగా చెప్పారట. ఆయన రిటైరైన తరువాత ప్రధానకార్యదర్శిగా వచ్చిన యస్.పి.టక్కర్ ద్వారా ఈ నోట్‌ను క్లియర్ చేసుకోవడానికి తెలుగుదేశం అధినేతలు ప్రయత్నించినా ప్రధానకార్యదర్శి టక్కర్ మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదని తెలిసింది.
Click on Image to Read: