హైకోర్టును ఆశ్రయించిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కోడెల ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని ఆమె కోరారు. శాసనసభ్యురాలిగా సభలో తన విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని కోరారు. కోడెల శివప్రసాదరావు తన పరిధి దాటి వ్యవహరించారని రోజా ఆక్షేపించారు. స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారని రోజా ఆరోపించారు. తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వెంటనే ఏడాదిపాటు సస్పెండ్ చేశారని […]
వైసీపీ ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కోడెల ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని ఆమె కోరారు. శాసనసభ్యురాలిగా సభలో తన విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని కోరారు. కోడెల శివప్రసాదరావు తన పరిధి దాటి వ్యవహరించారని రోజా ఆక్షేపించారు.
స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారని రోజా ఆరోపించారు. తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వెంటనే ఏడాదిపాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కనీసం తన వాదన కూడా వినకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు కూడా న్యాయసమీక్షపరిధిలోకి వస్తాయని… కాబట్టి సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా జరిగిన ఈ సస్పెన్షన్‌పై జోక్యం చేసుకోవాలని హైకోర్టును ఆమె కోరారు. రోజాను ఇలా ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం దిగి రాలేదు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం కోర్టుకు వెళ్లినట్టు అయింది.
Click on Image to Read: