Telugu Global
Cinema & Entertainment

కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా రివ్యూ

రేటింగ్‌ :3.25/5 విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016 దర్శకత్వం :  హను రాఘవపూడి ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,అనీల్ సుంకర బ్యానర్‌ : 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంగీతం :  విశాల్ చంద్రశేఖర్ నటీనటులు : నాని, మెహరిన్ , మురళీ శర్మ అందాల రాక్షసి సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈసారి కృష్ణగాడి వీర ప్రేమకథని తెరకెక్కించారు. పేరు వినగానే కథేమిటో అర్ధమైపోతుంది. అయితే వీరప్రేమకథ అన్నాడు కాబట్టి ఫైటింగ్‌లు అవీ […]

కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా రివ్యూ
X

రేటింగ్‌ :3.25/5
విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016
దర్శకత్వం : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,అనీల్ సుంకర
బ్యానర్‌ : 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నటీనటులు : నాని, మెహరిన్ , మురళీ శర్మ

అందాల రాక్షసి సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈసారి కృష్ణగాడి వీర ప్రేమకథని తెరకెక్కించారు. పేరు వినగానే కథేమిటో అర్ధమైపోతుంది. అయితే వీరప్రేమకథ అన్నాడు కాబట్టి ఫైటింగ్‌లు అవీ చేసి ప్రేమని దక్కించుకుంటాడని కూడా తెలిసిపోతుంది. అయితే పోస్టర్లపై చిన్నపిల్లల బొమ్మలు వేశారు కాబట్టి ఆ పిల్లలు మన హీరోకి సాయం చేస్తారని అనుకుంటాం.

అయితే ప్రారంభలోనే ఫ్యాక్షన్‌ కథని దర్శకుడు చెబుతాడు. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఫ్యాక్షన్‌ కథేమోనని అనుమానం వేస్తుంది. అయితే అమ్మాయి ఫ్యాక్షన్‌ ఇంటి అమ్మాయి. హీరో ఒక అనామకుడు. చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నా ధైర్యంగా బయటికి చెప్పలేడు. కారణం హీరోయిన్‌ అన్నని చూస్తే భయం. ఇది ఫస్టాఫ్‌.

అనంతపురం జిల్లాలో ఇంతమంచి లొకేషన్లున్నాయా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇద్దరి మధ్య క్యూట్‌ లవ్‌ స్టోరీ నడుస్తుంది. బోలెడంత కామెడీ. నానీ ఎంత మెచ్యూరిటీ సాధించాడంటే మామూలు డైలాగ్‌లతో కూడా కామెడీ పండించగలడు. మంచి పాటలు, కళ్ళకు ఆహ్లాదం కలిగించే దృశ్యాలతో కథ నడుస్తూ ఉంటే డైరెక్టర్‌కి నచ్చలేదు. అందుకే ఫ్యాక్షన్‌కి తోడు తీవ్రవాదుల్ని కూడా ప్రవేశపెడతాడు.

ఫ్యాక్షనిస్ట్‌ రాజన్నకి ఓ తమ్ముడుంటాడు. ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. అనుకోకుండా ఒక తీవ్రవాదిని అరెస్ట్‌ చేస్తాడు. దాంతో అతని పిల్లల కిడ్నాప్‌కి ప్లాన్‌ జరుగుతుంది. వాళ్ళని హీరో ఎలా కాపాడాడు, తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడన్నదే మిగతా కథ.

రాయలసీమ అంటేనే నరుక్కుంటారు, పొడుచుకుంటారనేది సినిమావాళ్ళ ఫిలాసపి. మంచి సేలబుల్‌ సబ్జెక్ట్‌కూడా. అయితే గ్లోబలైజేషన్‌ నేపధ్యంలో ఫ్యాక్షన్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాక్షనిస్ట్‌లు మోడ్రన్‌ అయిపోయారు. లోకల్‌గా జరిగే కాంట్రాక్టులు, టెండర్లకోసం కొట్టుకోవడం ఎప్పుడో మానేశారు. దేశవిదేశాలకు విస్తరించారు. ఫ్యాక్షనిస్ట్‌లు తరువాతి తరం (1970-90 మధ్య పుట్టిన వాళ్ళు) బాగా చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అందువల్ల అరకొరగా ఫ్యాక్షన్‌ వున్నా, వారికి అనుచరులు దొరకడం లేదు. కానీ సినిమావాళ్ళు మాత్రం ఏళ్ళ తరబడి ఒకటే రికార్డ్‌ వేస్తున్నారు.

ఈ సినిమాలో కూడా ఒకాయన నలుగురు కొడుకులను పోగొట్టుకుని పగతీర్చుకునే వారసత్వాన్ని అల్లుడికి అప్పగిస్తాడు. శత్రువులని చంపితేనే అతనికి శోభనం జరుగుతుంది. ఇది సీరియస్సో కామెడీనో అర్ధం కాదు. లేదంటే సీరియస్‌ కామెడీ కూడా కావచ్చు.

దర్శకుడు కథకు అవసరంలేని అనేక సీన్స్‌ రాసుకోవడం వల్ల కొంత గందరగోళానికి గురై దాదాపు 20 నిముషాల సినిమా అనవసరంగా తీసాడు. నిడివి తగ్గించుకుని ఉంటే సూపర్‌గా ఉండేది. అయినా కూడా ఇది బ్యూటిఫుల్‌ సినిమానే. టేకింగ్‌లో దర్శకుడి గొప్పదనమే దీనికి కారణం. నాని పాత్రని చిత్రీకరించిన తీరు అద్భుతం. ఎక్కడా కూడా జౌచిత్యం కోల్పోదు. హీరోయిన్‌కి ఆపదవచ్చినపుడు మాత్రమే అతను హీరో. మిగిలిన సమయంలో భయస్థుడు. పిల్లలనటన మరో ప్లస్‌పాయింట్‌. పొడిపొడి డైలాగులతో నడిచే లాజికల్‌ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. హీరోయిన్‌ మెహరిన్‌ అందంగా ఉండి పదేపదే కాజల్‌ని గుర్తుతెస్తుంది. ఇద్దరికి పోలికలు అంతలా ఉన్నాయి.

ఫస్టాఫ్‌లో రాజేష్‌ సీన్స్‌, సెకండాఫ్‌లో పెళ్ళి ఇంట్లో కామెడి కొంత అనవసరం అనిపిస్తాయి. అయితే ప్రథ్వి, ప్రభాస్‌శీను, మురళి ఎపిసోడ్‌ బాగుంటుంది. ఫొటోగ్రఫి, బ్యాగ్రవుండ్‌ స్కోర్‌ సింప్లీ సూపర్భ్‌. హను రాఘవపూడి మరోసారి సత్తాని నిరూపించుకున్నాడు.

అయితే ఈ ప్రేమకథకి ఇంత హింస అవసరమా? బాల్యంలోని ప్రేమని, యవ్వనంలోని ప్రేమని కలిపి ఒకే ఫ్రేమ్‌లో చిన్నప్పటి జంట, హీరోహీరోయిన్లతో ఒకే ఫ్రేమ్‌లో తీయగలిగిన దర్శకుడికి ఇంత హింస చూపించాల్సిన ఆవశ్యకత వుందా? లవ్‌స్టోరీపైనే ఏకాగ్రత చూపకుండా కథని పక్కదారి పట్టించాడు. కొంచెం శ్రద్ధవహించే వుంటే ఇది క్లాసిక్‌ అయివుండేది.

– జి ఆర్‌. మహర్షి

Click on Image to Read:

garam-movie-review

Mehreen Stills

Mehreen-FI

First Published:  12 Feb 2016 10:26 AM IST
Next Story