ఐన్‌స్టీన్ ఊహించినది....నేడు నిజమైంది..!
వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలో చెప్పిన గురుత్వాకర్షణ తరంగాల ప్రకంపనాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చూశారు. ఖగోళ రంగంలో దీన్ని ఒక గొప్ప అడుగుగానే భావించాలి. ఈ తరంగాలు మనకు అంతరిక్షం, కాలం అనే అంశాలమీద అవగాహనని పెంచుతాయి. సాపేక్షసిద్ధాంతంలో ఐన్‌స్టీన్ ఈ వివరాలు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే, మనకు నచ్చిన పనులు చేస్తుంటే కాలం అసలు స్ఫురణకు రాకపోవడం, నచ్చని పనిలో ఉంటే కాలం గడవనట్టుగా అనిపించడం అనే అంశంమీద పలు ఉదాహరణలు […]
వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలో చెప్పిన గురుత్వాకర్షణ తరంగాల ప్రకంపనాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చూశారు. ఖగోళ రంగంలో దీన్ని ఒక గొప్ప అడుగుగానే భావించాలి. ఈ తరంగాలు మనకు అంతరిక్షం, కాలం అనే అంశాలమీద అవగాహనని పెంచుతాయి. సాపేక్షసిద్ధాంతంలో ఐన్‌స్టీన్ ఈ వివరాలు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే, మనకు నచ్చిన పనులు చేస్తుంటే కాలం అసలు స్ఫురణకు రాకపోవడం, నచ్చని పనిలో ఉంటే కాలం గడవనట్టుగా అనిపించడం అనే అంశంమీద పలు ఉదాహరణలు బయటకు వచ్చాయి.
గురుత్వాకర్షణ తరంగాల ధ్వనిని మనం వినగలమా అనే ఐన్‌స్టీన్ సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికినట్టయింది. అమెరికాలో భూగర్భంలో అమర్చిన రెండు సాంకేతిక డిటెక్టర్లు ఆ తరంగాల ప్రకంపనాలను నమోదు చేశాయి. 130 ఏళ్ల క్రితం రెండు కృష్ణ బిలాలు ఢీకొనడంతో కలిసిపొయిన రెండు ద్రవ్యరాశులు అంతరిక్షంలో ముందుకు కదులుతూ, 2015 సెప్టెంబరు నాటికి భూమికి చేరాయి. శాస్తవేత్తలు వాటిని పరిశోధించి వివరాలు వెల్లడించడానికి ఇంతకాలం పట్టింది. ప్రస్తుతం మనం అనుభూతి చెందుతున్న కాలం సైతం ఇందులో ప్రధానంగా ఉంది. కాలం ఎలా ఏర్పడింది… అనే ప్రశ్నకు సమాధానం వెతకడంలోనూ ఇవి మనకు పనికొస్తాయి.
కృష్ణబిలాలు, న్యూట్రాన్ నక్షత్రాలు వంటి భారీ వస్తువులు ఢీకొట్టడం ద్వారా అంతరిక్షం-కాలానికి సంబంధించిన గురుత్వాకర్షణ తరంగాల సృష్టి జరుగుతున్నది. అయితే వీటిని గుర్తించలేము. ఈ తరంగాల ప్రకంపనల విషయంలో వీటిని సూత్రీకరించిన ఐన్‌స్టీనే తిరిగి సందేహాలు వ్యక్తం చేశారు. వీటిని వినడం కష్టమన్నారు. అసలు అలాంటివంటూ ఉన్నాయా అని కూడా అన్నారు. చివరకు ఆ మహామేధావి కృషికి మరొక కొనసాగింపుగా గురుత్వాకర్షణ తరంగాల ప్రకంపనాలను శాస్త్రవేత్తలు విన్నారు. అది పిచ్చుకలు చేసే ధ్వనిలా ఉందని, 20లేదా 30హెర్ట్జ్‌ల తక్కువ ఫ్రీక్వెన్సీతో మొదలై, క్షణాల్లోనే 150 హెర్ట్జ్‌ల దాకా వెళ్లినట్లుగా వారు చెబుతున్నారు. అంతరిక్షం, కాలంమీద స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గురుత్వాకర్షణ తరంగాల ప్రకంపనాలను వినడం బిగ్‌బ్యాంగ్ పరిశోధనా ఫలితం కంటే ఎక్కువయినదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాకు చెందిన లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషన్ వేవ్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనా వివరాలు వెల్లడించారు.