అలా పెళ్లి అయినా... కానట్టేనట..!
తనకు రెండవ భర్తనుండి రక్షణ కల్పించాలని, భరణం, ఇంకా చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలు ఇప్పించాలని ఒక మహిళ కోర్టుకి వెళ్లగా న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆమె, ఆమె రెండోభర్త ఇద్దరూ అంతకుముందు వివాహితులై ఉండటం, మొదటి పెళ్లి ద్వారా ఏర్పడిన బంధంనుండి విడాకుల ద్వారా బయటకు రాకపోవడాన్ని కోర్టు కారణాలుగా చూపింది. మొదటి వివాహంతో జీవిత భాగస్వామి అయిన వ్యక్తికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే దాన్ని వివాహమనలేమని, వివాహానికి సబంధించిన ఏ అర్హతలూ, […]
తనకు రెండవ భర్తనుండి రక్షణ కల్పించాలని, భరణం, ఇంకా చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలు ఇప్పించాలని ఒక మహిళ కోర్టుకి వెళ్లగా న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆమె, ఆమె రెండోభర్త ఇద్దరూ అంతకుముందు వివాహితులై ఉండటం, మొదటి పెళ్లి ద్వారా ఏర్పడిన బంధంనుండి విడాకుల ద్వారా బయటకు రాకపోవడాన్ని కోర్టు కారణాలుగా చూపింది.
మొదటి వివాహంతో జీవిత భాగస్వామి అయిన వ్యక్తికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే దాన్ని వివాహమనలేమని, వివాహానికి సబంధించిన ఏ అర్హతలూ, హక్కులు ఈ బంధానికి ఉండవని ఈ కేసుకి తీర్పునిచ్చిన న్యాయమూర్తి వెల్లడించారు. న్యూఢిల్లీలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శివానీ చౌహాన్ ఈ తీర్పునిచ్చారు.
ప్రస్తుతం మీరిద్దరూ ఉన్న బంధానికి వివాహ అర్హతే లేదు కాబట్టి మీ రెండో భర్తపై గృహహింస నిరోధక చట్టం-2005ని నమోదు చేయడానికి గానీ, వివాహ బంధంగా ద్వారా వచ్చే నష్టపరిహారాలను పొందడానికి కానీ అవకాశం లేదని న్యాయమూర్తి తెలిపారు.
సదరు మహిళను మొదటి భర్త ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనూ వివాహితుడే. ఇద్దరూ విడాకులు తీసుకోకుండా రెండోపెళ్లి చేసుకున్నారు.
అయితే మొదటిపెళ్లి గురించి తెలియకపోవడం వలన రెండోపెళ్లి చేసుకున్నా ఈ విషయంలో తేడా ఉండదని న్యాయమూర్తి పేర్కొన్నారు.