మళయాల సినిమాతో వస్తా !
చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్..టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలే తీసారు.దాదాపు అన్ని సినిమాలు స్టార్ హీరోలతోనే చేశాడు.అయితే టెంపర్ సినిమా తరువాత ఇంత వరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమా ప్లాన్ చేయలేదు. స్టార్ హీరోలు అందరు బిజీ కావడంతో ప్రస్తుతానికి ఒక మళయాల సినిమా ను తెలుగులో రీమేక్ చేసే ప్రణాళిక ను బండ్ల గణేష్ సిద్దం చేస్తున్నాడని వినికిడి . మమతా […]

చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్..టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలే తీసారు.దాదాపు అన్ని సినిమాలు స్టార్ హీరోలతోనే చేశాడు.అయితే టెంపర్ సినిమా తరువాత ఇంత వరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమా ప్లాన్ చేయలేదు. స్టార్ హీరోలు అందరు బిజీ కావడంతో ప్రస్తుతానికి ఒక మళయాల సినిమా ను తెలుగులో రీమేక్ చేసే ప్రణాళిక ను బండ్ల గణేష్ సిద్దం చేస్తున్నాడని వినికిడి . మమతా మోహన్ దాస్.. దిలిప్ కాంబినేషన్ లో చేసిన 2 కంట్రీస్ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను భారీ ధర చెల్లించి కొనుకున్నట్లు టాక్. మరి ఈ సినిమాకు తెలుగులో ఏ స్టార్ హీరో తో ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి.