రామోజీపై మళ్లీ యుద్ధం ప్రకటించిన ఉండవల్లి-వెనుకున్నది ఎవరు?
ఒకప్పుడు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు వైపుచూడాలంటే భయపడేవారు. కానీ ఆ భయం వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పటాపంచలైంది. రామోజీ అక్రమాలను వైఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శించారు. వారిలో అందరి కంటే ముందుండి పోరాడిన వ్యక్తి ఉండవల్లి అరుణకుమార్. మార్గదర్శి అక్రమాలపై ఉండవల్లి చేసిన పోరాటం ఓ దశలో రామోజీకి కూడా చెమటలు పట్టించింది. అయితే వైఎస్ మరణం తర్వాత రామోజీపై పోరాటం విషయంలో ఉండవల్లి మౌనం దాల్చారు. కానీ చాలా కాలం […]
ఒకప్పుడు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు వైపుచూడాలంటే భయపడేవారు. కానీ ఆ భయం వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పటాపంచలైంది. రామోజీ అక్రమాలను వైఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శించారు. వారిలో అందరి కంటే ముందుండి పోరాడిన వ్యక్తి ఉండవల్లి అరుణకుమార్. మార్గదర్శి అక్రమాలపై ఉండవల్లి చేసిన పోరాటం ఓ దశలో రామోజీకి కూడా చెమటలు పట్టించింది. అయితే వైఎస్ మరణం తర్వాత రామోజీపై పోరాటం విషయంలో ఉండవల్లి మౌనం దాల్చారు. కానీ చాలా కాలం తర్వాత రామోజీపై నేరుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉండవల్లి అరుణకుమార్. రామోజీకి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసుల్లో ఉన్నవారికి ఇలాంటి అవార్డు ఇవ్వరని… అలాంటిది ఒక ఆర్థిక నేరస్తుడికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.అవినీతి రహిత పాలన అని చెప్పుకునే మోదీ..రామోజీ లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వడం దారుణమన్నారు. మార్గ దర్శి కేసు, ఫిల్మ్ సిటీ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. రామోజీ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలు పంపుతున్నట్టు ఉండవల్లి వెల్లడించారు. విశాఖలో సైతం రామోజీపై ఒక చీటింగ్ కేసు ఉందన్నారు. రామోజీ తొలిరోజుల్లో ఎర్రచొక్కా వేసుకున్నారని అనంతరం పచ్చ చొక్క వేసుకుని తిరుగుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మధ్యమధ్యలో కాంగ్రెస్ టోపీ కూడా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చాలా గ్యాప్ తర్వాత రామోజీపై ఉండవల్లి ఈ రేంజ్‌లో ఫైర్ అవడం చర్చనీయాంశమైంది.
గతంలో వైఎస్ అండతో రామోజీపై ఉండవల్లి యుద్ధం చేశారని చెబుతారు. వైఎస్ మరణం తర్వాత కాస్త మెత్తబడ్డారు. మరి ఇప్పుడు ఉండవల్లి వెనుక ఎవరున్నారన్నది చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనా కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి పవిత్రమైన పద్మ అవార్డులు ఇచ్చే విషయంలో కేంద్రం అన్ని కోణాల్లో ఆలోచించుకోవాలి. లేకుంటే కొద్దికాలానికి పద్మ అవార్డులు తీసుకునేందుకు మంచి వారు కూడా వెనక్కు తగ్గే ప్రమాదం ఉంది.
Click on Image to Read: