'వాళ్లకు' ఇక తెలంగాణ సేఫ్ జోన్
నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది తెలుగువారికి వ్యతిరేకంగా కాదు. రాయలసీమమీద కానీ, ఉత్తరాంధ్రమీద కానీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద కానీ, తెలంగాణా వాదులకు కోపంలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక తెలంగాణావాది చెప్పినట్లు కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒక రాష్ట్రం చేస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఒక రాష్ట్రంగా ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు అనేది ఆనాడు చాలామంది తెలంగాణావాదుల అభిప్రాయం కూడా. వేములవాడ రాజరాజేశ్వరి గుడికి ప్రసాదంగా లడ్లు గుంటూరు జిల్లానుంచి రావడాన్ని […]
నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది తెలుగువారికి వ్యతిరేకంగా కాదు. రాయలసీమమీద కానీ, ఉత్తరాంధ్రమీద కానీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద కానీ, తెలంగాణా వాదులకు కోపంలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక తెలంగాణావాది చెప్పినట్లు కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒక రాష్ట్రం చేస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఒక రాష్ట్రంగా ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు అనేది ఆనాడు చాలామంది తెలంగాణావాదుల అభిప్రాయం కూడా.
వేములవాడ రాజరాజేశ్వరి గుడికి ప్రసాదంగా లడ్లు గుంటూరు జిల్లానుంచి రావడాన్ని ఒక తెలంగాణావాది ఎత్తిచూపుతూ మా తెలంగాణలో లడ్లుచేయగలిగిన వ్యాపారులు ఎవరూ లేరా? అని ప్రశ్నించడం గమనార్హం. తెలంగాణలో ఏ నీళ్ల ప్రాజెక్టు రాబోతుందో ముందే తెలుసుకొని అక్కడి భూములన్నిటిని అతి తక్కువ ధరకు ఎవరు కొట్టేసారో తెలంగాణావాదులు గుర్తించారు. హైటెక్ సీటీ నుంచి ప్రతీ ప్రాజెక్టు చుట్టూతా వందల వేల ఎకరాలు ఎవరు ఆక్రమించి అనుభవిస్తున్నారో వాళ్లకు తెలుసు. ప్రభుత్వ భూములను పప్పూ బెల్లాల్లా ఎవరికి సంతర్పణ చేశారో తెలంగాణావాదులు తెలుసుకున్నారు. సీఎం తెలంగాణ వ్యక్తి అయినా, రాయలసీమ వ్యక్తి అయినా అత్యధికంగా లాభపడిన జిల్లాలు ఏవో తెలంగాణా వాదులు ఎత్తిచూపారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఒక సామాజిక వర్గం దోపిడీకి, అధిపత్యానికి, అహంభావానికి వ్యతిరేకంగా సాగింది. ఆ సామాజికవర్గం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చేయని ప్రయత్నంలేదు. కానీ తెలంగాణవాదులు విజయం సాధించారు.
పరిస్థితిని అర్ధంచేసుకున్న ఆ సామాజిక వర్గం క్రమంగా తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌నూ లొంగదీసుకుంది. రాజకీయ తంత్రంలో భాగంగా కేసీఆర్ లొంగినట్టు నటిస్తున్నారా? లేక నిజంగానే లొంగిపోయారా? అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిమ్‌సిటీని దున్నుతానన్న కేసీఆర్ అదే ఫిలిమ్‌సిటీకి వెళ్లి రామోజీకి స్నేహహస్తం చాచడం అందరికీ ఆశ్ఛర్యమే! .
జీహెచ్‌యంసీ ఎన్నికల్లో కేసీఆర్ ఘనవిజయంవెనుక, తెలంగాణాలో టీడీపీ పతనం వెనుక, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ దుకాణం ఖాళీచేసే ప్రయత్నాల వెనుక రామోజీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబుల త్రయం ఆలోచనలు, ఆమోదం ఉన్నాయంటున్నారు.
తెలంగాణాలో ఇక ఎలాగూ గెలవలేం అనే అభిప్రాయానికి వచ్చిన వాళ్లు ముందుచూపుతో తమ సామాజికవర్గపు ఆర్ధికప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ ప్రయోజనాలని పక్కనపెట్టారు. తెలంగాణ గ్రామాల్లో ప్రాజెక్టులకింద భూములు ఆక్రమించిన తమ సామాజిక వర్గీయుల రక్షణకోసం, ప్రయోజనాలకోసం అలాగే హైదరాబాద్ నగరంలో తమ వాళ్ల ఆస్థుల కోసం, వ్యాపారాలకోసం ముఖ్యంగా సినీరంగంకోసం, ప్రభుత్వంనుంచి అప్పనంగా పొందిన భూముల కోసం కేసీఆర్‌తో కలగలసిపోయారు.
చంద్రబాబుకు రెండు కళ్లు. ఒకటి తన సామాజిక వర్గం. రెండు తన అనుబంధ మీడియా. జాగ్రత్తగా చూస్తే ఇవి రెండూ ఇటీవల కాలంనుంచి టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్ కుటుంబంపై తమ చల్లని చూపులు ప్రసరిస్తూ ఉండడం గమనించవచ్చు. ఈ మార్పు ఒక్కసారిగా బయటపడకుండా, తెలంగాణ ప్రజలు గమనించకుండా రేవంత్‌రెడ్డిలాంటి ఎక్‌స్ట్రా యాక్టర్‌చేత నాలుగురోజులు నాలుగు అరుపులు అరిపించి క్రమంగా రాజకీయ రంగం నుంచి మెల్లిగా తప్పుకుంటారని, కేసీఆర్ కు ఆత్మీయ మిత్రుల్లా మిగిలిపోతారని, తమ సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ తెలంగాణ ‘అభివృద్ధిలో’ ఒక భాగమవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Click on Image to Read: