శంకర్ భక్తికి ఫలితం దక్కింది
జబర్దస్త్ స్టేజిమీద సదరుషో కామెడీ యాక్టర్ శంకర్, పవన్ కల్యాణ్ మీద చాలా స్కిట్లు చేశాడు. అందులో పవన్‌ని అతను దాదాపు దేవుడిస్థాయిలో నిలబెట్టి కొలిచాడు. పవన్ కల్యాణ్‌కి తాను వీరాభిమానిగా నిరూపించుకున్నాడు. ఆ భక్తికి, పూజలకు ఫలితం దక్కినట్టే ఉంది. పవన్ కల్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్‌లో శంకర్ అన్న వరహాల బాబుకి ఒక మంచిపాత్ర దక్కినట్టుగా తెలుస్తోంది. జబర్దస్త్ జడ్జి నాగబాబు తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కి జబర్దస్త్ నటీనటులు కొందరిని […]
జబర్దస్త్ స్టేజిమీద సదరుషో కామెడీ యాక్టర్ శంకర్, పవన్ కల్యాణ్ మీద చాలా స్కిట్లు చేశాడు. అందులో పవన్‌ని అతను దాదాపు దేవుడిస్థాయిలో నిలబెట్టి కొలిచాడు. పవన్ కల్యాణ్‌కి తాను వీరాభిమానిగా నిరూపించుకున్నాడు. ఆ భక్తికి, పూజలకు ఫలితం దక్కినట్టే ఉంది. పవన్ కల్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్‌లో శంకర్ అన్న వరహాల బాబుకి ఒక మంచిపాత్ర దక్కినట్టుగా తెలుస్తోంది.
జబర్దస్త్ జడ్జి నాగబాబు తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కి జబర్దస్త్ నటీనటులు కొందరిని రికమెండ్ చేయగా వారికి సర్దార్…లో అవకాశాలు దొరికినట్టుగా సమాచారం. అందులో వరహాల బాబు ఉన్నాడు. పవన్ కల్యాణ్ తన సోదరుడికి అవకాశం ఇచ్చినందుకు శంకర్ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక విలేజ్ సెట్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.