అప్పుడు క్షణక్షణం.. ఇప్పుడు వంగవీటి రంగా...
రామ్ గోపాల్ వర్మ. ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమా ప్రచారం విడుదలకు ముందే భారీగా చేసేయడంలో ఆయనొక లైబ్రరి లాంటి వాడు. తాజాగా వంగవీటి రంగ జీవితం ఆధారం గా సినిమా చేయడానికి ఆయన చేస్తున్న హంగామా చూస్తునే వున్నాం. ఈ మధ్య ఒక వాయిస్ ఓవర్ చెప్పి సోషల్ మీడియాకు వదిలాడు. వంగవీటి రంగ లాంటి వ్యక్తి జీవిత కథ చేయడం తన జీవిత లక్ష్యం అన్నట్లు చెప్పుకొచ్చారు. శివ తో ప్రారంభమైన […]
రామ్ గోపాల్ వర్మ. ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమా ప్రచారం విడుదలకు ముందే భారీగా చేసేయడంలో ఆయనొక లైబ్రరి లాంటి వాడు. తాజాగా వంగవీటి రంగ జీవితం ఆధారం గా సినిమా చేయడానికి ఆయన చేస్తున్న హంగామా చూస్తునే వున్నాం. ఈ మధ్య ఒక వాయిస్ ఓవర్ చెప్పి సోషల్ మీడియాకు వదిలాడు. వంగవీటి రంగ లాంటి వ్యక్తి జీవిత కథ చేయడం తన జీవిత లక్ష్యం అన్నట్లు చెప్పుకొచ్చారు. శివ తో ప్రారంభమైన తన సినిమా కెరీర్ వంగవీటి తో పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో తనకు ఇదే ఆఖరు చిత్రమని కూడా క్లారీటి ఇచ్చారు. గతంలో క్షణ క్షణం సినిమా చేసిన తరువాత వర్మ చేసిన వ్యాఖ్యనం క్రిటిక్స్ ఇంకా మరచిపోలేదు. తను టాలీవుడ్ లో ఎప్పటికి సినిమాలు చేయనని చెప్పారు అప్పట్లో. కానీ బాలీవుడ్ లో కొంత కాలం తన హవా చూపించి.. తన వెలుగు తగ్గిన తరువాత.. రక్త చరిత్ర అంటూ టాలీవుడ్ నే అంటి పెట్టుకుని చిత్రాలు చేశారు. ప్రస్తుతం మళ్లీ ముంబాయికి తన నివాసం మార్చిన వర్మ..వంగవీటి రంగ జీవితం ఆధారంగా చేసే చిత్రమే తెలుగులో ఆఖరి చిత్రం అన్నారు. నిజంగా వర్మ తన మాటకు కట్టుబడి వుంటారా..;?