ఫాం హౌస్‌పై మక్కువ చూపుతున్న జక్కన్న!
కాంక్రీట్ జంగిల్స్‌లో డబ్బుని పండించే రాజకీయనేతలు, సినీతారలు, వాణిజ్యవేత్తలు తదితరులు తీరికవేళల్లోనో, అభిరుచిగానో ఫామ్ హౌస్‌ల్లో కూరగాయలు ఆకుకూరలు పండిస్తుంటారు. హైదరాబాద్ నగర శివార్లలో ఒక ఫామ్ హౌస్‌ని ఏర్పాటు చేసుకోవడం ధనవంతులకు ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఆ వరుసలోకి రాజమౌళి కూడా చేరాడు. హైదరాబాద్ నగర శివార్లలో 20 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్‌ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. దాన్ని డిజైన్ చేసే పనిని తన సన్నిహిత మిత్రుడైన ఆర్ట్ డైరక్టర్ రవీందర్‌కి […]
కాంక్రీట్ జంగిల్స్‌లో డబ్బుని పండించే రాజకీయనేతలు, సినీతారలు, వాణిజ్యవేత్తలు తదితరులు తీరికవేళల్లోనో, అభిరుచిగానో ఫామ్ హౌస్‌ల్లో కూరగాయలు ఆకుకూరలు పండిస్తుంటారు. హైదరాబాద్ నగర శివార్లలో ఒక ఫామ్ హౌస్‌ని ఏర్పాటు చేసుకోవడం ధనవంతులకు ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఆ వరుసలోకి రాజమౌళి కూడా చేరాడు. హైదరాబాద్ నగర శివార్లలో 20 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్‌ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. దాన్ని డిజైన్ చేసే పనిని తన సన్నిహిత మిత్రుడైన ఆర్ట్ డైరక్టర్ రవీందర్‌కి అప్పజెప్పాడట. అది అచ్చంగా ఒక గ్రామంలా ఉండాలని చెప్పాడట. అంతేకాదు, అక్కడ వ్యవసాయం చేయాలని, చెట్లు పెంచాలని, కూరగాయలు పండించాలని రాజమౌళి ఆశిస్తున్నాడు. రాజమౌళి తీసుకున్న భూమికి చేరువలోనే కీరవాణి, నిర్మాత సాయి కొర్రపాటి ఫాం హౌస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి ముగింపు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా తీరిక చూసుకుని కొంతసమయాన్ని ఫాంహౌస్ పనులకోసం కేటాయిస్తున్నాడు.