ఆ విషయంలో చరణ్ తర్వాతే ఎవరైనా...!
హీరోయిన్లను రిపీట్ చేయడంలో రామ్ చరణ్ అంతటోడు మరొకడు లేడు. అప్పుడెప్పుడే వెంకటేశ్ బాబు… సౌందర్యను వరుసగా రిపీట్ చేస్తే అంతా చెప్పుకున్నారు. వాళ్ల కాంబినేషన్ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయింది. మళ్లీ ఇప్పుడు మనకు చరణ్ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మొన్నటివరకు వరుసగా కాజల్ ను రిపీట్ చేసిన మెగాపవర్ స్టార్… తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మీద మనసుపడ్డాడు. ఈనెల 16 నుంచి సెట్స్ పైకి రాబోతున్న రామ్ చరణ్ కొత్త […]
BY admin10 Feb 2016 6:36 AM IST

X
admin Updated On: 10 Feb 2016 12:34 PM IST
హీరోయిన్లను రిపీట్ చేయడంలో రామ్ చరణ్ అంతటోడు మరొకడు లేడు. అప్పుడెప్పుడే వెంకటేశ్ బాబు… సౌందర్యను వరుసగా రిపీట్ చేస్తే అంతా చెప్పుకున్నారు. వాళ్ల కాంబినేషన్ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయింది. మళ్లీ ఇప్పుడు మనకు చరణ్ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మొన్నటివరకు వరుసగా కాజల్ ను రిపీట్ చేసిన మెగాపవర్ స్టార్… తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మీద మనసుపడ్డాడు.
ఈనెల 16 నుంచి సెట్స్ పైకి రాబోతున్న రామ్ చరణ్ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై చాలా చర్చ నడిచింది. చర్చ నడిచింది అనేకంటే ఓ మోస్తరు రచ్చ నడిచింది అని చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే… ఇలియానాను తీసుకుందామని దర్శకుడు సురేందర్ రెడ్డి…. కాజల్ ను తీసుకుందామని చెర్రీ మంకుపట్టు పట్టారు. మొత్తానికి వీళ్లిద్దరి మధ్య ఎవరో సయోధ్య కుదిర్చారు. ఇద్దర్నీ పక్కనపెట్టి రకుల్ ప్రీత్ సింగ్ ను మరోసారి సెలక్ట్ చేసుకున్నారు. జస్ట్ మొన్నంటే మొన్ననే రకుల్ తో కలిసి బ్రూస్ లీ సినిమా చేశాడు చరణ్. ఇప్పుడు వెంటనే ఆమెను రిపీట్ చేస్తున్నాడు. గతంలో కాజల్ విషయంలో కూడా ఇలానే జరిగిందనే విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Next Story