రజనీకాంత్ సినిమా ఆగిపోయింది
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. ఓ వైపు కబాలి సినిమా షూటింగ్ ను క్లైమాక్స్ కు తీసుకొస్తూనే… మరోవైపు రోబో-2 సినిమాను పరుగులుపెట్టిస్తున్నాడు. ఈ రెండింటిలో కబాలి సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా తీసుకురావాలనుకున్నాడు. అందుకే సినిమా షూటింగ్ ను గ్యాప్ లేకుండా జరిపారు. అయితే ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి రావట్లేదు. తాత్కాలికంగా ఆగిపోయింది. దీనికి కారణం కూడా మరెవరో కాదు. స్వయానా రజనీకాంతే. త్వరలోనే తమిళనాట […]
BY admin10 Feb 2016 8:59 AM IST
X
admin Updated On: 10 Feb 2016 10:09 AM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. ఓ వైపు కబాలి సినిమా షూటింగ్ ను క్లైమాక్స్ కు తీసుకొస్తూనే… మరోవైపు రోబో-2 సినిమాను పరుగులుపెట్టిస్తున్నాడు. ఈ రెండింటిలో కబాలి సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా తీసుకురావాలనుకున్నాడు. అందుకే సినిమా షూటింగ్ ను గ్యాప్ లేకుండా జరిపారు. అయితే ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి రావట్లేదు. తాత్కాలికంగా ఆగిపోయింది. దీనికి కారణం కూడా మరెవరో కాదు. స్వయానా రజనీకాంతే.
త్వరలోనే తమిళనాట ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటి సమయంలో తన సినిమాను రిలీజ్ చేస్తే అనవసరంగా క్రేజ్ తగ్గించుకోవడమే అవుతుందని రజనీకాంత్ భావిస్తున్నాడు. ఎందుకంటే.. తమిళ ప్రజానీకం ఎన్నికల టైమ్ లో ఎవర్నీ పట్టించుకోరు. మరీ ముఖ్యంగా తలైవా ఫ్యాన్స్ కూడా ఎలక్షన్లలో బిజీగా ఉంటారు. వీటన్నింటికంటే మరో పెద్ద రీజన్ కూడా ఉంది. పొరపాటున కబాలి సినిమాలో ఏమైనా డైలాగులు, సన్నివేశాలు రాజకీయపరంగా ఉంటే… కచ్చితంగా ముఖ్యమంత్రి జయలలిత కన్ను ఆ సినిమాపై పడుతుంది. గతంలో విజయ్ సినిమాను ఇలానే ఆమె అడ్డుకుందని సమాచారం. సో… ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నాడు రజనీకాంత్.
Next Story