వీళ్లది రెండు నాలుకల సిద్ధాంతం !
ఢిల్లీ లో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు, హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎం.ఎల్.ఏని దుయ్యబట్టారు. చేర్చుకున్న టీఆర్‌ఎస్ పార్టీపై కావల్సినంత బురద చల్లారు. టీడీపీ అనుబంధ మీడియా కూడా నీతి సూక్త ముక్తావళి వల్లించింది. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే వివేక్(కుత్బుల్లాపూర్) పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో చేరటాన్ని ప్రస్తావించగా.. స్వార్థపరులే పార్టీని వీడుతున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ మారేవారందరు స్వార్ధపరులైతే… ఎన్నికల ఫలితాలు వచ్చి […]
ఢిల్లీ లో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు, హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎం.ఎల్.ఏని దుయ్యబట్టారు. చేర్చుకున్న టీఆర్‌ఎస్ పార్టీపై కావల్సినంత బురద చల్లారు. టీడీపీ అనుబంధ మీడియా కూడా నీతి సూక్త ముక్తావళి వల్లించింది.
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే వివేక్(కుత్బుల్లాపూర్) పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో చేరటాన్ని ప్రస్తావించగా.. స్వార్థపరులే పార్టీని వీడుతున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ మారేవారందరు స్వార్ధపరులైతే… ఎన్నికల ఫలితాలు వచ్చి ఎం.పీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఎస్.పీ.వై రెడ్డిని, కొత్తపల్లి గీతను కండువ కప్పి పార్టీలోకి స్వాగతించిన చంద్రబాబును ఏమనాలని నెటిజన్లతో పాటు వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడిపి లోకి ఏ స్వార్ధంతో చేరారని వీరు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతలు టీడీపీలో చేరితే “జగన్‌కు జలక్” అని, “జగన్‌కు ఎదురుదెబ్బ” అని, “జగన్‌కి షాక్” అని రాసే పత్రికలు టీడీపీ ఎం.ఎల్.ఏలు ఇతర పార్టీల్లో చేరితే వీళ్లకు అప్పుడే నీతులన్నీ గుర్తొస్తాయని నెటిజన్‌లు జోకులు వేస్తున్నారు.
Click on Image to Read: