Telugu Global
NEWS

జగన్‌... రాహుల్‌, లోకేష్‌లాగా పప్పుసుద్ధ కాదు !

రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సీటును జగన్‌ ప్రామిస్‌ చేసినట్లుగా విజయసాయిరెడ్డికి ఇవ్వకుండా నందమూరి హరికృష్ణకి ఇస్తారని కొందరు, నాగబాబుకు ఇస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆఫీసులో కొందరికి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు రావడం ఇష్టంలేదు. దాంతో కాపు కులం పేరును తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ కాపులని దెబ్బతీసిన ఈ సందర్భంగా మనం ఒక కాపుకు రాజ్యసభ సీటు ఇస్తే కాపులు మన పార్టీవైపు మొగ్గుతారనే వాదనను తెరమీదకు తెస్తున్నారు. వాళ్లకు కాపులమీద ప్రేమకన్నా విజయసాయిరెడ్డికి సీటు […]

జగన్‌... రాహుల్‌, లోకేష్‌లాగా పప్పుసుద్ధ కాదు !
X

రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సీటును జగన్‌ ప్రామిస్‌ చేసినట్లుగా విజయసాయిరెడ్డికి ఇవ్వకుండా నందమూరి హరికృష్ణకి ఇస్తారని కొందరు, నాగబాబుకు ఇస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆఫీసులో కొందరికి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు రావడం ఇష్టంలేదు. దాంతో కాపు కులం పేరును తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ కాపులని దెబ్బతీసిన ఈ సందర్భంగా మనం ఒక కాపుకు రాజ్యసభ సీటు ఇస్తే కాపులు మన పార్టీవైపు మొగ్గుతారనే వాదనను తెరమీదకు తెస్తున్నారు. వాళ్లకు కాపులమీద ప్రేమకన్నా విజయసాయిరెడ్డికి సీటు రానివ్వకుండా చేయడమే కావాల్సింది. ఈ ఎత్తుగడ ఎంతవరకు పారుతుందో చూడాలి.

మరికొంతమంది నందమూరి హరికృష్ణను పార్టీలోకి తీసుకొని వచ్చి రాజ్యసభ సీటు ఇస్తారని అంటున్నారు. తద్వారా ఎన్టీఆర్‌ ఫ్యామిలీ కూడా మా వైపు వుందని చెప్పడం ద్వారా చంద్రబాబును దెబ్బకొట్టవచ్చని వాళ్ల ప్రచారం.

2004లో రాహుల్‌, సోనియాలు కూడా ఇదేవిధంగా ఆలోచించి ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరిని వంటింట్లోంచి నేరుగా తీసుకెళ్లి కేంద్రమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఆ పదేళ్ల కాలంలో ఆమె తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారంలోలేని లోటు తీర్చింది. సోనియా డైరెక్షన్‌లో బదులు వెంకయ్యనాయుడు డైరెక్షన్‌లో తన సామాజిక వర్గానికి కావాల్సిన సేవలు చేయడంలో పదేళ్లు ఊపిరిసలపనంత కృషి చేసింది. తనకు వీలైనంత మంది తన వాళ్లను కీలక స్థానాల్లో కూర్చోబెట్టడానికి అహర్నిశలు శ్రమించింది. తమ సామాజిక వర్గం అధికారంలో లేదన్న బాధ తెలియనివ్వకుండా రాత్రింబవళ్లు కష్టపడి తన సామాజిక వర్గానికి ఎనలేని సేవ చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోయాక సోనియాకు, రాహుల్‌కు తనేంటో తెలియజెప్పింది. మంచి గుణపాఠం నేర్పింది. ఇవన్నీ చూసిన జగన్‌ హరికృష్ణను నెత్తికెక్కించుకుంటాడా?.

హరికృష్ణను, జూనియర్‌ ఎన్టీఆర్‌ను దెబ్బతీయడానికి టీడీపీ చాలా తెలివిగా ఆడుతున్న గేమ్‌లో వీళ్లంతా తెలియక భాగస్వాములవుతున్నారా? లేక తెలిసే తమవంతు సహాయం చేస్తున్నారా? హరికృష్ణ జగన్‌వైపు వెళ్తున్నాడని ప్రచారం చేస్తే అది నమ్మిన ఒక సామాజిక వర్గం జూనియర్‌ ఎన్టీఆర్‌ను వెలివేస్తుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌పై ద్వేషం పెంచుకుంటుంది. ఆ తరువాత హరికృష్ణ వైఎస్‌ఆర్‌ పార్టీ వైపు వెళ్లడంలేదని తెలిసినా ఆ కోపం అలాగే ఉంటుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షపదవికి లోకేష్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ అడ్డుకాకుండా ఉండాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రెడిబిలిటీని దెబ్బతీయడం ఎంతో అవసరం. ఆ వ్యూహంలో భాగమే హరికృష్ణ వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళుతున్నారని చేస్తున్న ప్రచారం అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

వైఎస్‌ఆర్‌సీపీ పెట్టడంవల్ల జగన్‌ ఎన్ని బాధలు పడ్డాడో దాదాపు అంతే బాధలు పడ్డవాడు విజయసాయిరెడ్డి. ఆయనకన్నా నాలుగురోజులు ఎక్కువే జైలులో గడపాల్సివచ్చింది కూడా. ఆయన ఒక్క క్షణం జగన్‌తో మనకెందుకులే అనుకుని వుంటే, ప్రభుత్వానికి సహకరించివుంటే ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరమూ వుండేది కాదు, జగన్‌ జైలునుంచి బయటకు వచ్చే అవకాశమూ వుండేది కాదు. తనకోసం, తన కుటుంబంకోసం అంత గట్టిగా నిలబడ్డ వ్యక్తికి చేసిన ప్రమాణం నిలుపుకోకపోతే ఇస్తానన్న రాజ్యసభ సీటును ఎగ్గొడితే ఇక కార్యకర్తలు జగన్‌ని నమ్ముతారా? జగన్‌ ఇక “విశ్వసనీయత” అనే పదం ఉచ్ఛరించగలడా?

రాజ్యసభ సీటు విలువ ఎంతో అందరికన్నా బాగా తెలిసినవాడు జగన్‌. ఆఫర్లు ఆహ్వానిస్తే దాని విలువ ఎంత పలుకుతుందో అందరికన్నా ఆయనకే ఎక్కువ తెలుసు. ఆ కోణం నుంచి చూసినా హరికృష్ణ, నాగబాబులకు అంత విలువైన సీటును ఊరికే ఎందుకు ఇస్తాడు? ఆయన అంత అమాయకుడిలా కనిపిస్తున్నాడా?.

Click on Image to Read:

narayanpet-mla-rajender-red

Undavalli-Arun-Kumar-fire-o

tuni-attack

kamma-kulam

eenadu

errabelli-dayakar-rao2

revanth-reddy1

tdp-trs

tdp-logo

errabelli

jagan-lokesh

bhuma-chandrababu

jagan

tdp-government

gangireddy

revanth-reddy-chandrababu-n

revanth-reddy

babu2

telangana-tdp

cbn

First Published:  10 Feb 2016 10:29 AM IST
Next Story