Telugu Global
Cinema & Entertainment

ప్రభుదేవా తో సై అంటున్న అవంతిక‌

డాన్స్ లు చాల మంది చేస్తారు. పాట‌లు చాల మంది పాడతారు. కాని కొందరి డాన్సులు మాత్రమే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. అలాంటి కొరియోగ్రాఫ‌ర్స్ లో ప్ర‌భుదేవ ఒక‌డు. కొరియో గ్ర‌ఫ‌ర్ గా కెరీర్ ప్రారంభించి..యాక్టింగ్ లోను మెప్పించాడు.ఆ త‌రువాత ద‌ర్శ‌కుడుగా ఇటు టాలీవుడ్ లోను..అటు బి టౌన్ లోను త‌న ప్ర‌తిభ‌ను ఘ‌నంగా చాటుకున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవ హీరోగా ఒక త్రిభాష చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎల్ విజ‌య్ అనే తమిళ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను చేస్తుండ‌గా.. […]

ప్రభుదేవా తో సై అంటున్న అవంతిక‌
X

డాన్స్ లు చాల మంది చేస్తారు. పాట‌లు చాల మంది పాడతారు. కాని కొందరి డాన్సులు మాత్రమే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. అలాంటి కొరియోగ్రాఫ‌ర్స్ లో ప్ర‌భుదేవ ఒక‌డు. కొరియో గ్ర‌ఫ‌ర్ గా కెరీర్ ప్రారంభించి..యాక్టింగ్ లోను మెప్పించాడు.ఆ త‌రువాత ద‌ర్శ‌కుడుగా ఇటు టాలీవుడ్ లోను..అటు బి టౌన్ లోను త‌న ప్ర‌తిభ‌ను ఘ‌నంగా చాటుకున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవ హీరోగా ఒక త్రిభాష చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎల్ విజ‌య్ అనే తమిళ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను చేస్తుండ‌గా.. ప్ర‌భుదేవ నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భుదేవ స‌ర‌స‌న హీరోయిన్ చాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసా..? ఇంకెవ‌రు..మ‌న బాహుబ‌లి అవంతిక అలియాస్ త‌మ‌న్నా.

మరి ప్ర‌భుదేవ వంటి కొరియో గ్రాఫ‌ర్ స‌ర‌స‌న డ్యాన్స్ చేయాలంటే అంత తేలికైన ప‌నికాదు క‌దా..? అందుకే ప్ర‌భు సార్ తో డ్యాన్స్ అనే స‌రికి మ‌న మిల్క్ బ్యూటీకి కాస్త కంగారుగా ఉంద‌ట‌. అయితేనేమి త‌ను ఎలాగైన ప్రభు స‌ర‌స‌న డాన్స్ విష‌యంలో ఆయనను కూడా మెప్పించ‌గ‌ల‌న‌నే థీమాను వ్య‌క్తం చేస్తుంద‌ట‌. ప్ర‌భుదేవ‌, తమ‌న్నాల‌తో ఫోటో షూట్ కూడా జ‌రిగింది. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుదేవ స‌న్నిహిత‌లు స‌మాచారం మ‌రి.

First Published:  9 Feb 2016 6:40 AM IST
Next Story