తలపాగా తీసి విమానం ఎక్కమన్నారు!
మత విశ్వాసాలకు, మనం పెట్టుకున్న రూల్సుకి ఏదో ఒక సందర్భంలో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. తలపాగాతో విమానం ఎక్కబోయిన ఒక సిక్కుమత వ్యక్తిని మెక్సికో విమానాశ్రయం అధికారులు నిలిపివేశారు. తలపాగా తీసి విమానం ఎక్కాల్సిందిగా నిబంధన పెట్టారు. దాంతో అతను విమానం ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన అమెరికా యాక్టర్, డిజైనర్ వారిస్ అహ్లూవాలియా అమెరికాలోని మన్‌హట్టన్‌లో నివసిస్తున్నాడు. అతను మెక్సికో నుండి న్యూయార్క్ వెళ్లేందుకు ఏరో మెక్సికో విమానం ఎక్కుతుండగా ఈ సంఘటన […]
మత విశ్వాసాలకు, మనం పెట్టుకున్న రూల్సుకి ఏదో ఒక సందర్భంలో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. తలపాగాతో విమానం ఎక్కబోయిన ఒక సిక్కుమత వ్యక్తిని మెక్సికో విమానాశ్రయం అధికారులు నిలిపివేశారు. తలపాగా తీసి విమానం ఎక్కాల్సిందిగా నిబంధన పెట్టారు. దాంతో అతను విమానం ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన అమెరికా యాక్టర్, డిజైనర్ వారిస్ అహ్లూవాలియా అమెరికాలోని మన్‌హట్టన్‌లో నివసిస్తున్నాడు. అతను మెక్సికో నుండి న్యూయార్క్ వెళ్లేందుకు ఏరో మెక్సికో విమానం ఎక్కుతుండగా ఈ సంఘటన జరిగింది. బయటి ప్రపంచంలో ఉన్నపుడు సిక్కులు తలపాగాని తీయకూడదు అని అతను ఎంతగా నచ్చచెప్పినా అధికారులు వినలేదు.
వృథా అయిపోయిన ఏరో మెక్సికో విమాన టికెట్‌ని చేతిలో పట్టుకుని దిగిన ఫొటోని అహ్లూవాలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశాడు. మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్ నుండే న్యూయార్క్ టైమ్స్ అతడి ఇంటర్వ్యూ తీసుకుని ప్రచురించింది. అహ్లూవాలియా ఆస్కార్ అవార్డు నామినేటెడ్ సినిమా ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్లో నటించాడు. సిక్కుల హక్కులపై అవగాహన కల్పిస్తున్న సామాజిక కార్యకర్త కూడా. ఇది జరిగిన తరువాత చాలా గంటలు ఆయన ఎయిర్‌పోర్టులోనే ఉన్నాడు. మానవ హక్కులు, సిక్కు సంస్థల లాయర్లు, ఎరో మెక్సికో విమానయాన సంస్థ అధికారులు అతనితో ఫోనులో మాట్లాడారు.