చెప్పులతో...చెప్ప లేనంత బ్యాక్టీరియా!
చెప్పులు, బూట్లు…ఏవైనా సరే బయట వదిలిరావడం మంచి సంప్రదాయం. అంతే కాదు, మంచి ఆరోగ్యం కూడా. అరిజోనా యూనివర్శిటీ వారు చేసిన పరిశోధనలో వెల్లడైన విషయాలు తెలుసుకుంటే మనం ఇక జన్మలో చెప్పులతో ఇంట్లోకి రాలేము. ఒక్కసారి పాదరక్షలతో ఇంట్లోకి వస్తే 4లక్షల21వేల జాతుల బ్యాక్టీరియా మనతోపాటు లోపలికి వస్తుందట. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇంట్లోకి చేరి విరేచినాలు, పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు లాంటి అనారోగ్యాలను తెచ్చిపెడతాయట. ఇంట్లోకి చెప్పులతో రాకూడదు అనే పాలసీ పెట్టుకుంటే […]
చెప్పులు, బూట్లు…ఏవైనా సరే బయట వదిలిరావడం మంచి సంప్రదాయం. అంతే కాదు, మంచి ఆరోగ్యం కూడా. అరిజోనా యూనివర్శిటీ వారు చేసిన పరిశోధనలో వెల్లడైన విషయాలు తెలుసుకుంటే మనం ఇక జన్మలో చెప్పులతో ఇంట్లోకి రాలేము. ఒక్కసారి పాదరక్షలతో ఇంట్లోకి వస్తే 4లక్షల21వేల జాతుల బ్యాక్టీరియా మనతోపాటు లోపలికి వస్తుందట. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇంట్లోకి చేరి విరేచినాలు, పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు లాంటి అనారోగ్యాలను తెచ్చిపెడతాయట. ఇంట్లోకి చెప్పులతో రాకూడదు అనే పాలసీ పెట్టుకుంటే అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియాతో పాటు, 60 శాతం వరకు కాలుష్యం, విషాలు ఇంట్లో కి రాకుండా ఉంటాయి.