Telugu Global
Cinema & Entertainment

స‌మంత రూటే వేరు!

హీరోయిన్లు ఎంత సుకుమారంగా ఉంటే అంత గొప్ప అనుకునే రోజులు పోయిన‌ట్టే ఉన్నాయి. త‌మ స్త్రీత్వ సుకుమారం రూపు మార‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ చాలామంది హీరోయిన్లు ఇప్పుడు జిమ్‌కెళ్లి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే బాలివుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ ప్ర‌యోగాలు, ప్ర‌య‌త్నాలు బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌గా ప్రాంతీయ భాషా హీరోయిన్ల వ్యాయామ సూత్రాలు క‌నిపించ‌వు. ఇప్పుడు స‌మంత వారికంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా 100 కేజీల వెయిట్ లిఫ్ట‌ర్‌గా అవ‌త‌రించింది. బ‌క్క‌ప‌ల‌చ‌గా ఎప్పుడు చూసినా స్లిమ్‌గా క‌నిపించే […]

స‌మంత రూటే వేరు!
X

హీరోయిన్లు ఎంత సుకుమారంగా ఉంటే అంత గొప్ప అనుకునే రోజులు పోయిన‌ట్టే ఉన్నాయి. త‌మ స్త్రీత్వ సుకుమారం రూపు మార‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ చాలామంది హీరోయిన్లు ఇప్పుడు జిమ్‌కెళ్లి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే బాలివుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ ప్ర‌యోగాలు, ప్ర‌య‌త్నాలు బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌గా ప్రాంతీయ భాషా హీరోయిన్ల వ్యాయామ సూత్రాలు క‌నిపించ‌వు. ఇప్పుడు స‌మంత వారికంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా 100 కేజీల వెయిట్ లిఫ్ట‌ర్‌గా అవ‌త‌రించింది. బ‌క్క‌ప‌ల‌చ‌గా ఎప్పుడు చూసినా స్లిమ్‌గా క‌నిపించే స‌మంత‌లో ఇంత బ‌ల‌ముందా అనిపించే అద్భుత‌మైన ఫీట్‌ని చేసింది.

వంద కేజీల వెయిట్స్ ని లిఫ్ట్ (సుమో డెడ్‌లిఫ్ట్‌) చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఆమె ఈ ఫీట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న ట్రైన‌ర్ షూట్ చేస్తుండ‌గా స‌మంత ఈ ఫీట్‌ని మూడుసార్లు చేసింది. ఆమె చేసిన సాహ‌సాన్ని సెల‌బ్రిటీల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం అభినందిస్తున్నారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటూ మిగిలిన హీరోయిన్ల కంటే తాను భిన్న‌మ‌ని ఇప్ప‌టికే రుజువు చేసింది స‌మంత‌. అలాగే సినిమాల ప‌రంగానూ స్వ‌తంత్ర భావాలున్న అమ్మాయిగా త‌న అభిప్రాయాల‌ను చాలా సంద‌ర్భాల్లో నిర్మొహ‌మాటంగా చెప్పిందామె.

First Published:  9 Feb 2016 6:26 AM IST
Next Story