కులం పేరుతో పవన్‌పై వర్మ హాట్ ట్వీట్
ఆ మధ్య పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్‌లో వెంటాడిన డైరెక్టర్ వర్మ, మళ్లీ మొదలెట్టారు. పవన్ ఫ్యాన్స్ వర్మ ఫోటోకు దండేసి శ్రద్ధాంజలి ఘటించడంతో అప్పట్లో కాస్త తగ్గిన వర్మ.. కాపు ఉద్యమ నేపథ్యంలో పవన్‌పై ఘాటైన ట్వీట్ చేశారు. తుని ఘటనపై పవన్ తన ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారో కనీసం ఆయనకైనా అర్థమైందా అని ప్రశ్నించారు. తుని ఘటన ప్రెస్‌మీట్‌లో పవన్ చెప్పినవన్నీ చెప్పుడు మాటలేనని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌కు వస్తున్న సమయంలో కారులో పక్కనే కూర్చున్న వ్యక్తి చెప్పుడు […]
ఆ మధ్య పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్‌లో వెంటాడిన డైరెక్టర్ వర్మ, మళ్లీ మొదలెట్టారు. పవన్ ఫ్యాన్స్ వర్మ ఫోటోకు దండేసి శ్రద్ధాంజలి ఘటించడంతో అప్పట్లో కాస్త తగ్గిన వర్మ.. కాపు ఉద్యమ నేపథ్యంలో పవన్‌పై ఘాటైన ట్వీట్ చేశారు. తుని ఘటనపై పవన్ తన ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారో కనీసం ఆయనకైనా అర్థమైందా అని ప్రశ్నించారు. తుని ఘటన ప్రెస్‌మీట్‌లో పవన్ చెప్పినవన్నీ చెప్పుడు మాటలేనని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌కు వస్తున్న సమయంలో కారులో పక్కనే కూర్చున్న వ్యక్తి చెప్పుడు మాటలకు పవన్ ప్రభావితమై ఇచ్చిన స్పీచ్ లాగా ఉందన్నారు.
పవన్‌పై ఒక పద్యం కూడా ట్వీట్ చేశారు వర్మ. “కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా స్వచ్చమైన కమ్మల మనసున్న కాపులే బహుమేలు “… విశ్వదాభి రామ వినుర వేమ అంటూ ట్వీట్ చేశారు. జనసేన ప్రారంభించిన సమయంలో ఇచ్చిన స్పీచ్‌ను పవన్ మరోసారి చూసి తనకు తానే నేర్చుకోవాలని ఒక సూచన కూడా చేశారు. పవన్ అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాలను ఆ విధంగా వ్యక్తపరచని ఏ అభిమాని అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహే అని ట్వీట్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా వర్మ మరో కీలకమైన విషయాన్ని ట్వీట్ చేశారు. కమ్మల్లో కాపులు… కాపుల్లో కమ్మలు ఉన్నారని… చిరంజీవిలో కల్యాణ్, కల్యాణ్‌లో చిరంజీవి ఇందుకు ఉదాహరణ అన్నారు.
https://twitter.com/RGVzoomin/status/696388174692548609
https://twitter.com/RGVzoomin/status/696380422482038784
https://twitter.com/RGVzoomin/status/696378145503469568
https://twitter.com/RGVzoomin/status/696376776621068288
Click on Image to Read: