అక్రమ వసూళ్లతో నాకు సంబంధం లేదు: నారా రోహిత్
తన పేరు చెప్పి టీడీపీ విద్యార్థి నేత కోట్లాది రూపాయలు వసూలు చేయడంపై చంద్రబాబు సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ స్పందించారు. ఈ వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రోహిత్ పేరు చెప్పి టీఎన్‌ఎస్ఎఫ్( టీడీపీ అనుబంధ విద్యార్థి సంస్థ) నేత సాయి కృష్ణ కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో నారా రోహిత్ వెంటనే స్పందించారు. సాయికృష్ణ తనకు అభిమానిగా మాత్రమే తెలుసునన్నారు. అతడు చేసిన అక్రమ […]
తన పేరు చెప్పి టీడీపీ విద్యార్థి నేత కోట్లాది రూపాయలు వసూలు చేయడంపై చంద్రబాబు సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ స్పందించారు. ఈ వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రోహిత్ పేరు చెప్పి టీఎన్‌ఎస్ఎఫ్( టీడీపీ అనుబంధ విద్యార్థి సంస్థ) నేత సాయి కృష్ణ కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో నారా రోహిత్ వెంటనే స్పందించారు. సాయికృష్ణ తనకు అభిమానిగా మాత్రమే తెలుసునన్నారు. అతడు చేసిన అక్రమ వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
నారా రోహిత్ సినిమా కోసం పంక్షన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర నుంచి సాయికృష్ణ డబ్బులు తీసుకున్నారు. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు . అయితే మోసపోయామని తెలుసుకున్న బాధితులు సొమ్ము తిరిగి ఇవ్వాలని అడగ్గా బెదిరింపులకు దిగాడు సాయి కృష్ణ. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన వారిపై కాల్ మనీ కింద కేసు పెడుతానని సాయికృష్ణ బెదిరించాడు. దీంతో అతడిపై భవానీపురం పీఎస్‌లో కేసు నమోదైంది.
సాయికృష్ణ సొంతూరు విజయవాడ సమీపంలోని గొళ్లపూడి. నారా రోహిత్ సినిమా వ్యవహారాలన్నీ తానే చూస్తానని చాలా మందిని నమ్మించాడు. నారా రోహిత్ పేరు చెప్పే సరికి చాలా మంది డబ్బులు ఇచ్చేశారు. నారా రోహిత్ తో దిగిన ఫోటోలు చూపించడం, వారి ఎదురుగానే నారా రోహిత్ తో ఫోన్ లో మాట్లాడడం వంటి ఎత్తులు వేసి అందరినీ నమ్మించాడు సాయికృష్ణ.
Click on Image to Read: