రేవంత్‌ను ఐరన్ లెగ్‌గా చిత్రీకరించే పనిలో ఆ పత్రిక !
తెలంగాణలో టీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ పత్రిక ”నమస్తే తెలంగాణ” ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. రేవంత్ రెడ్డి లెగ్ మంచిది కాదన్న అర్థమొచ్చేలా కథనం రాసింది. అది కూడా టీడీపీ నేతలే రేవంత్ ఎన్నికల ప్రచారానికి వస్తే అంతే సంగతులని భయపడిపోతున్నారంటూ వెల్లడించింది. ”అమ్మో.. రేవంత్‌రెడ్డా! ఆయన కాలు పెట్టాడా..! ఇక అంతే సంగతులు?” అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారట. తాజాగా నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొంటున్న […]
తెలంగాణలో టీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ పత్రిక ”నమస్తే తెలంగాణ” ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. రేవంత్ రెడ్డి లెగ్ మంచిది కాదన్న అర్థమొచ్చేలా కథనం రాసింది. అది కూడా టీడీపీ నేతలే రేవంత్ ఎన్నికల ప్రచారానికి వస్తే అంతే సంగతులని భయపడిపోతున్నారంటూ వెల్లడించింది. ”అమ్మో.. రేవంత్‌రెడ్డా! ఆయన కాలు పెట్టాడా..! ఇక అంతే సంగతులు?” అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారట.
తాజాగా నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొంటున్న నేపథ్యంలో ”నమస్తే తెలంగాణ” ఈ లైన్‌లో కథనం రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇలా వరుసపెట్టి టీడీపీ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయని పత్రిక చెబుతోంది. ”ఇప్పుడు నారాయణఖేడ్‌లోనూ రేవంత్ అడుగు పెట్టారు కాబట్టి ఇక అంతే సంగతులు” అని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారట. మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్ అని చిత్రీకరించేలా ముందుకెళ్తున్నట్టుగా ఉంది. ఆదివారం నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించగా ప్రజలు తిరగబడ్డారని నమస్తే తెలంగాణ చెబుతోంది. దీంతో రేవంత్ రెడ్డి మధ్యలో వెనుదిరిగారని వెల్లడించింది.
రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు నమస్తే తెలంగాణపై నేరుగా విమర్శలు చేశారు. నమస్తే తెలంగాణను గుమస్తా తెలంగాణ అంటూ ఎద్దేవా చేసేవారు.
Click on Image to Read: