దీక్ష విరమణ- సీఎం కాళ్లు కడిగేందుకూ సిద్ధం!
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణ దీక్ష విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారు. ప్రభుత్వం తరపున ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. కాపు రిజర్వేషన్లపై మరో ఏడు నెలల్లో నివేదిక వచ్చేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కోసం కేటాయిస్తామని చెప్పింది. ఈ ఏడాది కాపు కార్పొరేషన్‌కు మరో 500 కోట్లు […]
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణ దీక్ష విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారు. ప్రభుత్వం తరపున ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. కాపు రిజర్వేషన్లపై మరో ఏడు నెలల్లో నివేదిక వచ్చేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కోసం కేటాయిస్తామని చెప్పింది. ఈ ఏడాది కాపు కార్పొరేషన్‌కు మరో 500 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది.
తుని ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు ఉండబోవని.. ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే అరెస్ట్‌లుంటాయని కళా వెంకట్రావు వెల్లడించారు. అచ్చెన్నాయుడు, వెంకట్రావు ఇద్దరూ కలిసి ముద్రగడకు నిమ్మరసం తాగించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముద్రగడ ప్రభుత్వ హామీలతో దీక్ష విరమిస్తున్నట్టు చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ఇంటికెళ్లి పళ్లెంలో పెట్టి సీఎం కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు. తమ జాతికి తగిన ఫలాలు ఇస్తే సీఎం కాళ్లు మొక్కడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
తమకు రిజర్వేషన్లు బీసీ కోటాలో కాకుండా జనాభా ప్రాతిపదికన జనరల్ కోటాలో ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు కృషి చేయాలని కోరారు. మరోసారి తాను రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి కల్పించవద్దని కోరారు. తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన రఘువీరారెడ్డి, జగన్, చిరంజీవి, దాసరి నారాయణరావు తదితరులకు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు.
Click on Image to Read: