Telugu Global
Health & Life Style

ఈ ఆరోగ్య సూత్రాలు...అంద‌రికోసం!

రోజువారీ దిన‌చ‌ర్య‌లో ఉప‌క‌రించే ఆరోగ్య సూత్రాలు ఇవి. గుర్తుంచుకుంటే కొన్ని అపోహ‌లు త‌గ్గుతాయి, కొన్ని విష‌యాల్లో  అవ‌గాహ‌న పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్‌కి గుండె ఆరోగ్యాన్ని పెంచే శ‌క్తి ఉంది. వంట‌ల్లో దీన్ని వాడితే క‌రోన‌రీ ఆర్ట‌రీ వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. కాస్త ద‌గ్గురాగానే మందుల షాపుకి వెళ్లి ద‌గ్గుమందు తెచ్చుకుని వేసుకోవ‌డం చాలామందికి అల‌వాటు. కానీ అలా తెచ్చుకున్న మందుల్లో చాలావ‌ర‌కు ప‌నిచేయ‌వ‌ని వైద్యులే అంగీక‌రిస్తున్నారు. అన్ని ర‌కాల ప్లాస్టిక్ గిన్నెల‌ను మైక్రోవేవ్‌లో వాడ‌కూడ‌దు. మేక్రోవేవ్ సేఫ్ […]

ఈ ఆరోగ్య సూత్రాలు...అంద‌రికోసం!
X

రోజువారీ దిన‌చ‌ర్య‌లో ఉప‌క‌రించే ఆరోగ్య సూత్రాలు ఇవి. గుర్తుంచుకుంటే కొన్ని అపోహ‌లు త‌గ్గుతాయి, కొన్ని విష‌యాల్లో అవ‌గాహ‌న పెరుగుతుంది.

  • ఆలివ్ ఆయిల్‌కి గుండె ఆరోగ్యాన్ని పెంచే శ‌క్తి ఉంది. వంట‌ల్లో దీన్ని వాడితే క‌రోన‌రీ ఆర్ట‌రీ వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.
  • కాస్త ద‌గ్గురాగానే మందుల షాపుకి వెళ్లి ద‌గ్గుమందు తెచ్చుకుని వేసుకోవ‌డం చాలామందికి అల‌వాటు. కానీ అలా తెచ్చుకున్న మందుల్లో చాలావ‌ర‌కు ప‌నిచేయ‌వ‌ని వైద్యులే అంగీక‌రిస్తున్నారు.
  • అన్ని ర‌కాల ప్లాస్టిక్ గిన్నెల‌ను మైక్రోవేవ్‌లో వాడ‌కూడ‌దు. మేక్రోవేవ్ సేఫ్ అనే గుర్తింపు ఉన్న‌వాటినే వాడాలి. వీటిలో ప్లాస్టిక్‌ని మెత్త‌బ‌ర‌చే ర‌సాయ‌నాలు ఉండ‌వు.
  • ప‌ళ్ల‌ను మెరిపిస్తాయి… అని ప్ర‌చారంలో చెప్పే టూత్ పేస్ట్‌లు అంత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేయ‌వు. పైపైన కాస్త వ‌ర‌కు ప‌నిచేసినా, ఇవి మామూలు వాటికంటే ఆరోగ్యానికి హానిక‌రం అని గుర్తుంచుకోవాలి.
  • వాకింగ్, ర‌న్నింగ్ రెండూ స‌మాన ఫ‌లితాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యం కోస‌మైతే ఈ రెండింటిలో ఏదైనా చేయ‌వ‌చ్చు.
  • టివి చూడ‌టం వ‌ల‌న చూపు దెబ్బ‌తిన‌దు, ఒక‌వేళ క‌ళ్లకు అల‌స‌ట‌గా అనిపిస్తే కాస్త విరామం తీసుకుంటే మంచిది.
  • మ‌రీ శ్రుతి మించి తింటే త‌ప్ప న‌ట్ప్ తిన‌డం వ‌ల‌న ఒళ్లు పెర‌గ‌దు, ఇంకా ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గిస్తాయి.
First Published:  7 Feb 2016 6:55 PM IST
Next Story