దెబ్బకు ఇల్లు అమ్ముకున్న వినాయక్ ?
అఖిల్ సినిమా ఊహించని పరాజయం అఖిల్ మీదకంటే వివి వినాయక్ మీదే ఎక్కువగా ప్రభావం చూపినట్టుంది. అందుకు రుజువు అన్నట్టుగా ఆయన ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న తన ఇంటిని 20 కోట్లకు అమ్మేశాడనే వార్త సినీ వర్గాల్లో వినబడుతోంది. వినాయక్, అఖిల్ సినిమా పంపిణీదారులను కొంతవరకు ఆదుకున్నట్టుగా వార్తలు ఉన్నాయి. అఖిల్‌కి 50 కోట్లు పెట్టుబడి పెడితే అది 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతకుముందు వినాయక్ దర్శకత్వం వహించిన అల్లుడు శ్రీను సైతం ఆశించిన […]
అఖిల్ సినిమా ఊహించని పరాజయం అఖిల్ మీదకంటే వివి వినాయక్ మీదే ఎక్కువగా ప్రభావం చూపినట్టుంది. అందుకు రుజువు అన్నట్టుగా ఆయన ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న తన ఇంటిని 20 కోట్లకు అమ్మేశాడనే వార్త సినీ వర్గాల్లో వినబడుతోంది. వినాయక్, అఖిల్ సినిమా పంపిణీదారులను కొంతవరకు ఆదుకున్నట్టుగా వార్తలు ఉన్నాయి. అఖిల్‌కి 50 కోట్లు పెట్టుబడి పెడితే అది 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతకుముందు వినాయక్ దర్శకత్వం వహించిన అల్లుడు శ్రీను సైతం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. దాంతో వినాయక్ చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తోంది. ఒక వేళ అలాంటి పరిస్థితులు లేకపోతే ఆ ఇల్లు కలిసిరాలేదనే నమ్మకం లాంటిదేమైనా దీని వెనుక ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే సినిమాకు పది కోట్లు తీసుకునే దర్శకుడు, కేవలం 20 కోట్లకే తన ఇంటిని అమ్మడాన్ని టాలివుడ్ వర్గాలే నమ్మలేకపోతున్నాయి. ఇవన్నీ కాక వినాయక్ ఇప్పుడు చిరంజీవి నూతన ప్రాజెక్టుకు దర్శకుడు కూడా. అలాంటి పరిస్థితుల్లో వినాయక్ నిర్ణయం అందరినీ విస్మయ పరుస్తోంది.