Telugu Global
NEWS

కాపులపై పవన్‌ ట్వీట్- ఇక్కడా క్లారిటీ మిస్

  కాపు రిజర్వేషన్ల ఉద్యమం మొదలుకాకముందు వరకు కాపులు పవన్‌ను దేవుడిలా చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.  కాపు రిజర్వేషన్లపై పవన్‌ స్పష్టమైన మద్దతు ఇవ్వకపోవడంతో  ఆయనపై కాపులు రగిలిపోతున్నారు. పలుచోట్ల కాపులే పవన్‌ ఫ్లెక్సీలను తగలబెట్టారు. రిజర్వేష్ల కోసం పోరాటం చేస్తున్న కాపులు పవన్‌పై తమకున్న ఆశలకు పూర్తిగా నీరొదిలేశారు.  దీంతో పవన్‌ ఆందోళన చెందినట్టు అర్థమవుతోంది. కాపులను దూరం చేసుకుంటే పవన్‌ రాజకీయంగా ఎదగడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో పవన్ […]

కాపులపై పవన్‌ ట్వీట్- ఇక్కడా క్లారిటీ మిస్
X

కాపు రిజర్వేషన్ల ఉద్యమం మొదలుకాకముందు వరకు కాపులు పవన్‌ను దేవుడిలా చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. కాపు రిజర్వేషన్లపై పవన్‌ స్పష్టమైన మద్దతు ఇవ్వకపోవడంతో ఆయనపై కాపులు రగిలిపోతున్నారు. పలుచోట్ల కాపులే పవన్‌ ఫ్లెక్సీలను తగలబెట్టారు. రిజర్వేష్ల కోసం పోరాటం చేస్తున్న కాపులు పవన్‌పై తమకున్న ఆశలకు పూర్తిగా నీరొదిలేశారు. దీంతో పవన్‌ ఆందోళన చెందినట్టు అర్థమవుతోంది.

కాపులను దూరం చేసుకుంటే పవన్‌ రాజకీయంగా ఎదగడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో పవన్ నష్ట నివారణ చర్యలకు దిగారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై ట్విట్టర్‌లో స్పందించారు. అయితే ఈ ట్వీట్లో కూడా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని పవన్ ఎక్కడా నేరుగా డిమాండ్ చేయలేదు. కేవలం ఆందోళన చేస్తున్న కాపు నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సూచించారు. అయితే దీక్ష చేస్తున్న ముద్రగడ గురించి పవన్ తన ట్వీట్‌లో ప్రస్తావించలేదు. ముద్రగడ పేరును ఎక్కడా ట్వీట్‌లో ప్రస్తావించకపోవడం కూడా విశేషమే. ముద్రగడను కాపులంతా ఇప్పుడు తమ నాయకుడిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పేరును పవన్ ప్రస్తావించకపోవడం ఆసక్తిగా ఉంది. ఏదీ ఏమైనా కాపుల్లో తనపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు పవన్ ట్విట్టర్‌లో స్పందించారని భావిస్తున్నారు. అయితే నేరుగా కాపులకు మద్దతు ఇవ్వకుండా పెద్దమనిషి తరహాలో ట్వీట్ లు పెట్టడం వల్ల పవన్ పై కాపులకు ఎంతవరకు నమ్మకం కలుగుతుందో చూడాలి.

First Published:  7 Feb 2016 11:58 AM IST
Next Story