ప్రచారానికి అప్పుడే స్టవ్ వెలిగించిన వర్మ
రామ్ గోపాల్ వర్మ. ఎవరెన్ని చెప్పిన ఒక టెక్నికల్ జీనియస్. సినిమాలు తీయడం లో ఆయనదో స్కూల్. మూడు ఫైట్స్. ఆరు పాటల సినిమా ఫార్మేట్ ను బద్దలు కొట్టి.. ఇండియన్ సినిమాకు హాలీవుడ్ మేకప్ వేసిన ఘనుడు. ఈ విషయంలో ఎవరికి సందేహాలు లేవు. అయితే నది అన్న తరువాత ఎండిపోకుండా.. దర్శకుడు అన్న తరువాత క్రియేటివిటి అప్ డేట్ అవ్వకుండా వుండటం కష్టం. ప్రస్తుతం ఆయన చిత్రాలు ఈ జనరేషన్ ఆడియన్స్ అసలు చూడటం […]
రామ్ గోపాల్ వర్మ. ఎవరెన్ని చెప్పిన ఒక టెక్నికల్ జీనియస్. సినిమాలు తీయడం లో ఆయనదో స్కూల్. మూడు ఫైట్స్. ఆరు పాటల సినిమా ఫార్మేట్ ను బద్దలు కొట్టి.. ఇండియన్ సినిమాకు హాలీవుడ్ మేకప్ వేసిన ఘనుడు. ఈ విషయంలో ఎవరికి సందేహాలు లేవు. అయితే నది అన్న తరువాత ఎండిపోకుండా.. దర్శకుడు అన్న తరువాత క్రియేటివిటి అప్ డేట్ అవ్వకుండా వుండటం కష్టం. ప్రస్తుతం ఆయన చిత్రాలు ఈ జనరేషన్ ఆడియన్స్ అసలు చూడటం లేదు. శివ , సత్య చిత్రాల సమయంలో వున్న యంగ్ ఆడియన్సే ఆయన చిత్రాలకు ఇప్పటికి ఫాలోవర్స్ అని చెప్పాలి. దర్శకుడిగా ఆయనోక జీనియస్ .
కట్ చే్స్తే..తన సినిమాలకు పైసా ఖర్చే లేకుండా ప్రచారం చేసుకోవడం అనేది రామ్ గోపాల్ వర్మకు తెలిసినట్లు మరెవరీకి తెలియదు. ఏ సమయంలో ఎలా మంట వేయాలి… ఏ సమయంలో సైలెంట్ గా ఉండాలి. ఎక్కడ పొగ పెట్టాలి. ఎక్కడ భగ్గుమని బాంబ్ పేల్చాలి.. ప్రచారంలో ఈ తరహా ఎత్తుగడులు వర్మకు పిండికొట్టినట్లే.
రక్త చరిత్ర చిత్రం తరువాత వర్మ.. కమ్ బ్యాక్ అనుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాలు చేశాడు. అవేవి మనుపటి వర్మను గుర్తు చేయలేక పోయాయి. ఈ మధ్య వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రంతో పరవాలేదనిపించుకున్నాడు. కట్ చేస్తే..తాజాగా విజయవాడకు చెందిన వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రను చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా.. సోషల్ నెట్ వర్క్ ను వేదిగ్గా చేసుకుని అప్పుడు ప్రచారం మొదలెట్టాడు. రంగకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పోస్ట్ చేస్తూ.. వీపరీతమైన హైప్ ను పెంచేస్తున్నాడు. పనిలో పనిగా .. కమ్మవారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కాపే నిజమైన కాపు అంటూ ట్వీట్ చేసి.. మంటను బాగా రాజేశాడు. ఈ వ్యాఖ్యమీద సోషల్ నెట్ వర్క్ లో అప్పుడే వీపరీతమైన చర్చ మొదలైంది. ఆయన మాత్రం తాంబూలం ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్లు గా అస్వాదిస్తున్నాడు. ఎంతైన వర్మ వర్మే..!