అబ్బురపరుస్తున్న టీడీపీ మీడియా విన్యాసాలు
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురిపరిచాయి. టీడీపీ ఘోరంగా ఓడిపోయినట్టు అంకెలు స్పష్టంగా చెబుతున్నా, ఆ సమయంలోనూ ఆ పార్టీ ఇమేజ్ కాపాడేందుకు కొన్ని చానళ్లు భలే ప్రయోగాలు చేశాయి. అందులో ఒకటేంటంటే… టీడీపీ వాళ్లు తమది అని భావించే ఒక మీడియా సంస్థ(పేపర్‌తోపాటు టీవీ చానల్ కూడా ఉంది) తన పత్రిక వెబ్‌సైట్‌లో గ్రేటర్ ఎన్నికల స్కోర్ బోర్డు పెట్టింది. వైసీపీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ […]

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురిపరిచాయి. టీడీపీ ఘోరంగా ఓడిపోయినట్టు అంకెలు స్పష్టంగా చెబుతున్నా, ఆ సమయంలోనూ ఆ పార్టీ ఇమేజ్ కాపాడేందుకు కొన్ని చానళ్లు భలే ప్రయోగాలు చేశాయి. అందులో ఒకటేంటంటే…
టీడీపీ వాళ్లు తమది అని భావించే ఒక మీడియా సంస్థ(పేపర్‌తోపాటు టీవీ చానల్ కూడా ఉంది) తన పత్రిక వెబ్‌సైట్‌లో గ్రేటర్ ఎన్నికల స్కోర్ బోర్డు పెట్టింది. వైసీపీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. అధికారికంగానూ ఆ పార్టీ ప్రకటించింది. ఆ సమయంలో ఇదే మీడియా సంస్థ గ్రేటర్ బరి నుంచి వైసీపీ తప్పుకుందని పెద్దపెద్ద కథనాలు ప్రసారం చేసింది. తీరా కౌంటింగ్ సమయానికి వచ్చే సరికి బరిలో వైసీపీ కూడా ఉందంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. స్కోర్ బోర్డులో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు వైసీపీ గుర్తు కూడా పెట్టింది. వైసీపీకి గ్రేటర్‌లో సున్నా స్థానాలు వచ్చాయంటూ అచ్చేసింది. వైసీపీ పోటీ చేయలేదన్న విషయం తెలియని వారు ఏమనుకుంటారు?. టీడీపీకి ఒక స్థానమైనా వచ్చింది… అదే వైసీపీకి అది కూడా రాలేదు అని పోల్చి చూసుకుంటారు. సదరు మీడియా సంస్థకు కావాల్సింది కూడా అదే.
టీడీపీ అనుకూల చానళ్లు చేసిన మరో విన్యాసం ఏమిటంటే!. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రోమోలను తయారు చేశాయి. అందులో కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఆర్‌ఎస్ తరపున కేటీఆర్, ఎంఐఎం తరపున అక్బర్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి ఫోటోలను పెట్టారు. ఎందుకంటే వీరంతా గ్రేటర్ ఎన్నికలను ఆయా పార్టీల తరపున పర్యవేక్షించారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఫోటో పెట్టారు బాగానే ఉంది. మరి టీడీపీ తరపున ఎవరి ఫోటో పెట్టాలి. నిజానికైతే కేటీఆర్ తరహాలోనే టీడీపీ ఎన్నికల బాధ్యతలను లోకేష్‌బాబు పర్యవేక్షించారు. కాబట్టి ఆ బాబు ఫోటోనే పెట్టాలి. కానీ తెలివైన టీడీపీ మీడియా చానళ్లు రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టాయి. మీడియా చానళ్లు రేవంత్ రెడ్డికి ఇచ్చిన గౌరవం అని చూసేవారికి అనిపించవచ్చు. కానీ అసలు సంగతి అది కాదు. టీడీపీ ఓటమికి మరోసారి రేవంత్ మీద నెట్టే ప్రయత్నం ఇది. అదే ఒక వేళ గ్రేటర్‌లో టీడీపీ దున్నేసి ఓ 70 స్థానాల్లో గెలిచి ఉంటే రేవంత్ ఫోటో పెట్టేవారా?. చచ్చినా ఆ పని చేయరు. తమ చినబాబు గ్రేట్ అంటూ నాన్నకు ప్రేమతో సాంగ్‌ను లోకేష్ బాబు, చంద్రబాబు మీద ప్లే చేసేవారు అనుకూల టీవీ చానళ్ల వాళ్లు.
Click on image to Read