అందులో తప్పులేదంటున్న హీరోయిన్
ఇండస్ట్రీలో హీరో కెరీర్ ఒక చెట్టు లాంటింది. హీరోయిన్ కెరీర్ ఒక సీజన్ లాంటింది. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. కథలన్నీ హీరో చుట్టూనే తిరుగుతుంటాయి. హీరోయిన్ రోల్ తక్కువ వుంటుంది. ఉన్నంతలోనే తమ సత్తా చాటుకోవాల్సి వుంటుంది. ఈ విషయంలో స్టార్ డమ్ సంపాదించిన వాళ్లను మెచ్చుకోవాల్సిందే . ఎందుకంటే .. కొద్ది పాటి సమయంలో ఆడియన్స్ ను మెప్పించి క్రేజ్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు కదా..! ఇక కథానాయికల […]
BY sarvi6 Feb 2016 8:41 AM IST

X
sarvi Updated On: 6 Feb 2016 8:46 AM IST
ఇండస్ట్రీలో హీరో కెరీర్ ఒక చెట్టు లాంటింది. హీరోయిన్ కెరీర్ ఒక సీజన్ లాంటింది. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. కథలన్నీ హీరో చుట్టూనే తిరుగుతుంటాయి. హీరోయిన్ రోల్ తక్కువ వుంటుంది. ఉన్నంతలోనే తమ సత్తా చాటుకోవాల్సి వుంటుంది. ఈ విషయంలో స్టార్ డమ్ సంపాదించిన వాళ్లను మెచ్చుకోవాల్సిందే . ఎందుకంటే .. కొద్ది పాటి సమయంలో ఆడియన్స్ ను మెప్పించి క్రేజ్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు కదా..!
ఇక కథానాయికల రెమ్యునరేషన్ పెంచడం ఏంటో మీడియా ఏదో పెద్ద ఇదైనట్లు ప్రచారం చేస్తుంటారు. ఇది సరైనది కాదంటోంది హాట్ బ్యూటీ శృతిహాసన్. కెరీర్ పరంగా హీరోయిన్స్ కే రిస్క్ ఎక్కువ వుంటుందని తేల్చింది. అందుకే డిమాండ్ వున్నప్పుడు రెమ్యునరేషన్ పెంచడం తప్పు కాదంటోంది ఈ ముద్దుగుమ్మ. చాలా మంది చెప్పినట్లే..దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని సపోర్ట్ చేసేసింది. నిజమే కదా !.
Next Story