కాజల్ ఆశలన్నీ పవనిజంపైనే
పవన్ ను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుందనేది దర్శకులు, నిర్మాతల నమ్మకం. ఇప్పుడీ నమ్మకం హీరోయిన్లకూ పాకింది. పవన్ సినిమాలో నటిస్తే క్రేజ్ కంపల్సరీ అనే సెంటిమెంట్ బలపడిపోయింది. కేవలం పవన్ సరసన నటించింది కాబట్టే తెలుగులో శృతిహాసన్ టాప్ రేంజ్ కు వెళ్లిపోయింది. కేవలం పవన్ సరసన నటించింది కాబట్టే… సమంత క్రేజ్ డబుల్ అయింది. సో… ఇప్పుడు తను కూడా వాళ్లలానే మరోసారి ఓ వెలుగు వెలగాలని తపిస్తోంది కాజల్. ఇప్పటికే టాలీవుడ్ లో […]
BY sarvi6 Feb 2016 5:31 AM IST

X
sarvi Updated On: 6 Feb 2016 7:03 AM IST
పవన్ ను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుందనేది దర్శకులు, నిర్మాతల నమ్మకం. ఇప్పుడీ నమ్మకం హీరోయిన్లకూ పాకింది. పవన్ సినిమాలో నటిస్తే క్రేజ్ కంపల్సరీ అనే సెంటిమెంట్ బలపడిపోయింది. కేవలం పవన్ సరసన నటించింది కాబట్టే తెలుగులో శృతిహాసన్ టాప్ రేంజ్ కు వెళ్లిపోయింది. కేవలం పవన్ సరసన నటించింది కాబట్టే… సమంత క్రేజ్ డబుల్ అయింది. సో… ఇప్పుడు తను కూడా వాళ్లలానే మరోసారి ఓ వెలుగు వెలగాలని తపిస్తోంది కాజల్. ఇప్పటికే టాలీవుడ్ లో చూడాల్సిన ఎత్తుపల్లాలన్నీ చూసేసిన ఈ బ్యూటీ… ఇప్పుడు మరోసారి హహా చాటాలనుకుంటోంది. అవకాశాలు బాగా అడుగంటిన ఈ టైమ్ లో… పవన్ సినిమా ఆక్సిజన్ గా పనిచేస్తుందని ఆశపడుతోంది. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో అత్యంత జాగ్రత్తగా ఉంటోందట కాజల్. అసలే రాకరాక వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని కూడా కాజల్ మిస్ చేసుకుంటే… ఇక టాలీవుడ్ కు టాటా చెప్పేసినట్టే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.
Next Story