దానం రాజీనామా అందుకే చేశారా?
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ, ఏఐసీసీకి పంపుతున్నట్టు మీడియాకు తెలిపారు .ఎన్నికల్లో తమను ప్రజలు విశ్వసించలేదన్నారు. టీఆర్ఎస్ హామీలు ప్రజలపై బాగా ప్రభావం చూపాయన్నారు. ఇంతపెద్ద మాండేట్ రావడం కనీవినీ ఎరుగని అంశమేనన్నారు. టీఆర్‌ఎస్ మేనిపెస్టోలోని డబుల్ బెడ్ రూమ్, 24 గంటల విద్యుత్, హైదరాబాద్‌లో ఆరు వేల పడకల ఆస్పత్రుల […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ, ఏఐసీసీకి పంపుతున్నట్టు మీడియాకు తెలిపారు .ఎన్నికల్లో తమను ప్రజలు విశ్వసించలేదన్నారు. టీఆర్ఎస్ హామీలు ప్రజలపై బాగా ప్రభావం చూపాయన్నారు. ఇంతపెద్ద మాండేట్ రావడం కనీవినీ ఎరుగని అంశమేనన్నారు. టీఆర్‌ఎస్ మేనిపెస్టోలోని డబుల్ బెడ్ రూమ్, 24 గంటల విద్యుత్, హైదరాబాద్‌లో ఆరు వేల పడకల ఆస్పత్రుల నిర్మాణం వంటి హామీలన్నీ స్వాగతించాల్సినవేనన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించలేదని అయినా సరే గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా నైతిక బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఇక సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను పార్టీకి దూరం చేసుకుంటున్నామని అధిష్ఠానానికి తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మనమంతా ఓడిపోతున్నామని అభ్యర్థులకు తానే ముందే చెప్పానని దానం అన్నారు. అప్పటికే ప్రజల మూడ్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు.
Click on image to Read