కండోమ్ వాడకపోవడం రేప్ అవుతుందా?
అమెరికా దమననీతిని బయటపెట్టి ఆ దేశ ఆగ్రహానికి గురైన వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే మూడు సంవత్సరాలనుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నాడు. ఎంబసి నుంచి బయటికి వస్తేఅరెస్టు చెయ్యాలని లండన్ పోలీసులు మూడేళ్ళనుంచి కాసుకొని అక్కడే కూర్చున్నారు. అమెరికా రహస్యాలను బయటపెట్టినందుకు అసాంజేని అరెస్టు చెయ్యలేరు. కాబట్టి కొండనుతొవ్వి ఎలుకను పట్టినట్టు అసాంజే మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసు ఏమిటంటే స్వీడన్‌లో అసాంజే ఒకసారి లైసెన్స్‌వున్న వ్యభిచార గృహానికి వెళ్ళి ఒకామెతో […]
అమెరికా దమననీతిని బయటపెట్టి ఆ దేశ ఆగ్రహానికి గురైన వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే మూడు సంవత్సరాలనుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నాడు. ఎంబసి నుంచి బయటికి వస్తేఅరెస్టు చెయ్యాలని లండన్ పోలీసులు మూడేళ్ళనుంచి కాసుకొని అక్కడే కూర్చున్నారు.
అమెరికా రహస్యాలను బయటపెట్టినందుకు అసాంజేని అరెస్టు చెయ్యలేరు. కాబట్టి కొండనుతొవ్వి ఎలుకను పట్టినట్టు అసాంజే మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసు ఏమిటంటే స్వీడన్‌లో అసాంజే ఒకసారి లైసెన్స్‌వున్న వ్యభిచార గృహానికి వెళ్ళి ఒకామెతో గడిపాడు, వచ్చేశాడు. ఇపుడు ఆ విషయాన్ని బయటికి తీసి ఆ వేశ్యచేత అసాంజేమీద కేసుపెట్టించారు. కేసు ఏమిటంటే అసాంజే తనతో గడిపేముందు కండోమ్ వాడతానని చెప్పాడని కానీ వాడలేదని ఆమె కేసు పెట్టింది. ఈ విషయంలో అసాంజేను అరెస్టుచేసి స్వీడన్ పంపడానికి బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసాంజేకి కాపలా కాయడానికి ఇప్పటికే బ్రిటన్ కొన్ని కోట్లరూపాయలు ఖర్చుపెట్టింది. ఈ కేసు విషయంలో అసాంజే ఏం భయపడటంలేదు. అయితే స్వీడన్‌కు వెళితే అక్కడనుంచి తనను అమెరికాకు పట్టుకుపోతారని, అంతమొందిస్తారని అసాంజే భయం.
దురదృష్టం ఏమిటంటే అసాంజే విషయంలో మన మీడియాలో తప్పుడు వార్తలు రావడం. అసాంజే గురించి రాసినప్పుడల్లా ఆయన స్వీడన్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడని రాయడం. కండోమ్ వాడకపోవడం, అత్యాచారానికి పాల్పడడం రెండూ ఒకటవుతాయా?