Telugu Global
Cinema & Entertainment

బాహుబలి ట్రాప్ లో రాజమౌళి

ఔరా…! రాజ‌మౌళి ఎమిటి ..కంట్రోల్ త‌ప్ప‌డం ఏమిటి అనిపిస్తుంది క‌దా. నిజ‌మే రాజ‌మౌళి మాత్రం మాన‌వ మాత్రుడే క‌దా. ఆయ‌న‌కు ఫీలింగ్స్.. వీరాభిమానం వుంటాయి కదా.! అస‌లే సినిమా అంటే అంతులేని ప్యాష‌న్. సినిమా మీద ఆయ‌న‌కున్న ప్యాష‌న్ గురించి తెలిసిన వాళ్లు..ఆయ‌న్ను టాలీవుడ్ జేమ్స్ కెమ‌రూన్ అంటారు. క‌ట్ చేస్తే.. ఇక బాహుబ‌లి తో రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా సృష్టించిన ప్ర‌భంజ‌నం తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయం అయ్యింది. క‌ట్ మ్యాట‌ర్ ఏమిటంటే..బాహుబ‌లి సినిమా మీద […]

బాహుబలి ట్రాప్ లో రాజమౌళి
X

ఔరా…! రాజ‌మౌళి ఎమిటి ..కంట్రోల్ త‌ప్ప‌డం ఏమిటి అనిపిస్తుంది క‌దా. నిజ‌మే రాజ‌మౌళి మాత్రం మాన‌వ మాత్రుడే క‌దా. ఆయ‌న‌కు ఫీలింగ్స్.. వీరాభిమానం వుంటాయి కదా.! అస‌లే సినిమా అంటే అంతులేని ప్యాష‌న్. సినిమా మీద ఆయ‌న‌కున్న ప్యాష‌న్ గురించి తెలిసిన వాళ్లు..ఆయ‌న్ను టాలీవుడ్ జేమ్స్ కెమ‌రూన్ అంటారు. క‌ట్ చేస్తే.. ఇక బాహుబ‌లి తో రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా సృష్టించిన ప్ర‌భంజ‌నం తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయం అయ్యింది. క‌ట్ మ్యాట‌ర్ ఏమిటంటే..బాహుబ‌లి సినిమా మీద రాజ‌మౌళి రోజు రోజుకు అంతులేని ప్రేమ లో ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది.

వాస్త‌వంగా ప్ర‌స్తుతం చేస్తున్న బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ తో .. బాహుబ‌లి ని ముగించేస్తున్న‌ట్లు చెప్పారు. కానీ మొద‌టి పార్ట్ తో వ‌చ్చిన స్పంద‌న చూసిన త‌రువాత రాజ‌మౌళి ఆలోచ‌న నిదానంగ మారుతున్న‌ట్లు తెలుస్తుంది. ఆద‌ర‌ణ బాగా వుండ‌టంతో బాహుబ‌లి ని స్టాప్ చేయ‌డ‌కం కంటే ఏదో ఒక రూపంలో కంటిన్యూ చేస్తేనే బెట‌ర‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. పెద్ద గా కంటెంట్ లేని బాహుబ‌లి మొద‌టి భాగం దేశ‌వ్యాప్తంగా విడుద‌లైన అన్ని భాష‌ల్లో క‌లిపి 600 వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక సెకండ్ పార్ట్ ఒక రేంజ్ లో కంటెంట్ ఉంటుంది. క‌చ్చితంగా మొద‌టి భాగాన్ని మించి వుంటుంది. దీంతో ఏదో విధంగా బాహుబ‌లి కి మ‌రో సీక్వెల్ ఆలోచ‌న ఆయ‌న మ‌దిలో మెదులుతున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు స‌మ‌చారాం. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, లీడ్ రోల్స్ చేయ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ , సుదీప్ లు కీ రోల్స్ చేశారు. సెకండ్ పార్ట్ లో వీరే కంటిన్యూ అవుతున్నారు. మొత్తం మీద రాజ‌మౌళి బాహుబ‌లి ప్రేమ‌లో మునిగి తేలుతున్నాడ‌న్న‌ది నిజం అంటున్నారు.

First Published:  5 Feb 2016 8:38 AM IST
Next Story