వారితో... నాకిస్తా!- సోనియా, రాహుల్‌పై ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 31న పాతబస్తీలోని బాబానగర్‌లో ప్రసంగించిన అక్బరుద్దీన్ … సోనియా,రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ పట్ల చాలా పరుషపదజాలం వాడారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనేమన్నారంటే “కాంగ్రెస్ పార్టీని దేశమంతా వెంటాడుతా… మోదీతో కలిసి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తా… ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా. ఇందిరా గాంధీ […]
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 31న పాతబస్తీలోని బాబానగర్‌లో ప్రసంగించిన అక్బరుద్దీన్ … సోనియా,రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ పట్ల చాలా పరుషపదజాలం వాడారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఆయనేమన్నారంటే “కాంగ్రెస్ పార్టీని దేశమంతా వెంటాడుతా… మోదీతో కలిసి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తా… ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా. ఇందిరా గాంధీ దారుసలాం(ఎంఐఎం పార్టీ కార్యాలయం) గడప తొక్కింది. కానీ మేమెప్పుడూ గాంధీ భవన్ గడప తొక్కం. భవిష్యత్తులో సోనియా, రాహుల్‌తో దారుసలాం గడపను నాకిస్తా’’ అంటూ అక్బర్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఒక బరిబాతలోడు అని అన్నారు. అంతేకాదు.
కాంగ్రెస్ ఒక వ్యభిచారుల పార్టీ అని విమర్శించారు. బాబ్రీ మసీదుకు తాళం తీసింది. శిలాన్యాస్ చేసింది, విగ్రహాలు పెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ‘’ఒక వ్యభిచారి పాతబస్తీలో తిరుగుతూ తమ వల్లే ఆస్తులు కూడబెట్టారని చెబుతున్నాడు. మాపై సీబీఐ విచారణ జరిపించండి. తాగుబోతు, చీకటిపడితే ఆడవాళ్ల సాయం లేకుండా ఇంటికెళ్లలేని వాడు మాపై విమర్శలు చేస్తాడా?” అంటూ అక్బర్ మండిపడ్డారు. సోనియా విదేశీయతను కూడా అక్బర్ ప్రశ్నించారు. వంద కోట్ల మంది ఉన్న దేశంలో కాంగ్రెస్‌కు వారసుడే దొరకలేదా అని ప్రశ్నించారు. ఇటలీ బొమ్మను తెచ్చుకుని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ను తగలబెట్టిన మోదీని అధికారంలో ఉండగా ఇటలీ బొమ్మ ఎందుకు అరెస్ట్ చేయించలేదని అక్బర్ ప్రశ్నించారు. అక్బర్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో !.
Click on image to Read