బాబు భద్రతను ఇప్పుడే ఎందుకు పెంచుతున్నారు?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. తాజాగా ఉండవల్లి కరకట్ట ఆనుకుని ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చీమచిటుక్కుమన్నా సెక్యూరిటీ అలర్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. సీఎం గెస్ట్ హౌస్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరోసారి భద్రత చర్యలను రెట్టింపు చేస్తుండడం చర్చనీయాంశమైంది. తాజాగా అతిథి గృహానికి వెళ్లే కరకట్ట మార్గంలో […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. తాజాగా ఉండవల్లి కరకట్ట ఆనుకుని ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చీమచిటుక్కుమన్నా సెక్యూరిటీ అలర్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. సీఎం గెస్ట్ హౌస్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరోసారి భద్రత చర్యలను రెట్టింపు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
తాజాగా అతిథి గృహానికి వెళ్లే కరకట్ట మార్గంలో అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం వరకు దృశ్యాలను స్పష్టంగా ఇది రికార్డ్ చేయగలదు. 360 డిగ్రీల కోణంలో తిరిగే విధంగా దీన్ని చేశారు. కరకట్టకు ఇరువైపుల ఉన్న పంట పొలాలు, చిన్నచిన్న రోడ్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో అదనంగా మరిన్ని బలగాలను సీఎం గెస్ట్ హౌజ్ దగ్గర మోహరించారు. ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం వెళ్లే దారి వెంబడి ఉన్న దుకాణాలపైనే సీఎం సెక్యూరిటీ క న్నేసింది. దుకాణాల్లో అపరిచిత వ్యక్తులు పొంచి ఉండే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని చెబుతున్నారు. కాబట్టి దుకాణాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తుని ఘటన తర్వాత ఈ భద్రతా చర్యలను వేగవంతం చేశామని చెబుతున్నారు. ఇప్పటికే సిఎం ఇంటికి ఒక వైపుగా ఉన్న కృష్ణానదిలో స్పీడ్ బోట్లను మోహరించి వాటి సాయంతో సీఎం ఇంటికి పహారా కాస్తున్నారు. కరకట్ట మార్గాన్ని నిత్యం పోలీసులు జాగీలాలతో కాపు కాస్తున్నారు. అయితే తుని ఘటన తర్వాత చంద్రబాబు ఇలా ఒక్కసారిగా భద్రతను పెంచుకోవడం చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల వల్లే భద్రత పెంచామని పోలీసులు చెబుతున్నా… తుని ఘటన తర్వాత హఠాత్తుగా సీఎం భద్రతపై హడావుడి చేయడం వెనుక కొన్ని రాజకీయ ఎత్తుగడలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
Click on image to Read