Telugu Global
Cinema & Entertainment

పెళ్లాన్ని ఎలా ప్రేమించాలో " తెలుసుకోవ‌డానికి రెండున్న‌ర కోట్ల ఖ‌ర్చు!

బెల్లంకొండ శ్రీనివాస్ రెండ‌వ‌చిత్రం స్పీడున్నోడు ఈ రోజు రిలీజ‌యిన‌ సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాలో లాగానే ఇందులోకూడా సెంటిమెంట్‌గా త‌మ‌న్నాతో స్పెష‌ల్‌సాంగ్‌లో స్టెప్పులేశాడు శ్రీనివాస్‌. అయితే ఈ పాట చిత్రీక‌ర‌ణకు రెండున్న‌ర కోట్ల రూపాయిల ఖ‌ర్చు అయింద‌ట‌. బ్యాచిల‌ర్ బాబూ అంటూ సాగే ఈ పాట సాహిత్యంలో… పెళ్లాన్ని ఎలా ప్రేమించాలో, పెళ్లాన్నిఎపుడు ఏం అడ‌గాలో, పెళ్లానికెపుడు ఏమివ్వాలో చెప్పేందుకు ఏ కోచింగు సెంట‌రూ లేద‌ని… ఉంటుంది. అత్యంత భారీగా తీసిన ఈ సాంగ్, ఐట‌మ్ సాంగ్‌లా కాక సంద‌ర్భోచితంగానే ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాస […]

పెళ్లాన్ని ఎలా ప్రేమించాలో  తెలుసుకోవ‌డానికి రెండున్న‌ర కోట్ల ఖ‌ర్చు!
X

బెల్లంకొండ శ్రీనివాస్ రెండ‌వ‌చిత్రం స్పీడున్నోడు ఈ రోజు రిలీజ‌యిన‌ సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాలో లాగానే ఇందులోకూడా సెంటిమెంట్‌గా త‌మ‌న్నాతో స్పెష‌ల్‌సాంగ్‌లో స్టెప్పులేశాడు శ్రీనివాస్‌. అయితే ఈ పాట చిత్రీక‌ర‌ణకు రెండున్న‌ర కోట్ల రూపాయిల ఖ‌ర్చు అయింద‌ట‌. బ్యాచిల‌ర్ బాబూ అంటూ సాగే ఈ పాట సాహిత్యంలో… పెళ్లాన్ని ఎలా ప్రేమించాలో, పెళ్లాన్నిఎపుడు ఏం అడ‌గాలో, పెళ్లానికెపుడు ఏమివ్వాలో చెప్పేందుకు ఏ కోచింగు సెంట‌రూ లేద‌ని… ఉంటుంది. అత్యంత భారీగా తీసిన ఈ సాంగ్, ఐట‌మ్ సాంగ్‌లా కాక సంద‌ర్భోచితంగానే ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాస రావు అంటున్నారు. హీరో పెళ్లి నిశ్చయమ‌య్యాక జ‌రిగే బ్యాచిల‌ర్ పార్టీలో ఈ పాట ఉంటుంద‌ని, పాట‌లో విష‌యాలు పెళ్ల‌యిన త‌రువాత అత‌నెలా ఉండాలో చెప్పెలా ఉంటాయి కాబ‌ట్టి, ఇది క‌థ‌కు అనుగుణంగానే ఉంటుంద‌ని, మ‌హిళ‌ల పెద‌వుల‌పై న‌వ్వు తెప్పిస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

మొద‌టి సినిమాలో త‌మ‌న్నాతో తాను చేసిన పాట ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంద‌ని, ఇది కూడా అలాగే వారికి న‌చ్చుతుంద‌ని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పాడు. తాను స్టార్ కొడుకుని కాద‌ని, త‌న వెనుక త‌న తండ్రి ఉన్నా, త‌న‌ని తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంద‌ని చెబుతున్న ఈ స్పీడున్నోడు ఎంత స్పీడ్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

First Published:  5 Feb 2016 7:30 AM IST
Next Story