Telugu Global
Cinema & Entertainment

రేపటితో ఊపిరి అయిపోతుంది

నాగార్జున-కార్తి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఊపిరి. దీన్ని మల్టీస్టారర్ అనేకంటే విభిన్న కథాచిత్రం అంటేనే బెటర్. ఎందుకంటే… నాగ్ వీల్ చెయిర్ లో ఉంటాడు కాబట్టి. ఇక సినిమా విషయానికొస్తే…. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రేపటితో సెట్స్ కు గుడ్ బై చెప్పేయనుంది. ఈ విషయాన్ని అటు హీరోయిన్ తమన్నతో పాటు నాగ్ కూడా కన్ ఫర్మ్ చేశారు. తమన్నా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేయగా… మరో 24 […]

రేపటితో ఊపిరి అయిపోతుంది
X

నాగార్జున-కార్తి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఊపిరి. దీన్ని మల్టీస్టారర్ అనేకంటే విభిన్న కథాచిత్రం అంటేనే బెటర్. ఎందుకంటే… నాగ్ వీల్ చెయిర్ లో ఉంటాడు కాబట్టి. ఇక సినిమా విషయానికొస్తే…. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రేపటితో సెట్స్ కు గుడ్ బై చెప్పేయనుంది. ఈ విషయాన్ని అటు హీరోయిన్ తమన్నతో పాటు నాగ్ కూడా కన్ ఫర్మ్ చేశారు. తమన్నా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేయగా… మరో 24 గంటల్లో షూటింగ్ అయిపోతుందని నాగార్జున కూడా వెల్లడించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో… పీవీపీ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియోను ఈనెల 28న విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 25న థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. మూవీలో కార్తి సరసన తమన్న హీరోయిన్ గా నటించగా…. నాగార్జున సరసన శ్రియ, అనుష్క, గాబ్రియల్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

First Published:  4 Feb 2016 9:01 AM IST
Next Story