ఆ హెయిర్ డ్రెస్సర్ వ్యసనాలను కత్తిరిస్తున్నాడు!
ఒక్కోసారి మార్పువైపు వేసే చిన్న అడుగులు, వినూత్న ఆలోచనలు మంచిఫలితాన్ని తెచ్చిపెడతాయి. గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో నివసించే ప్రవీణ్ కూడా అలాంటి ఆలోచనలే చేశాడు. అతని స్నేహితులు ముగ్గురు మద్యం అలవాటుకి బానిసలై, అనారోగ్యాలతో మరణించారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రవీణ్‌కి ఉన్నా తానూ పేదవాడు కావడం వలన అది సాద్యం కాలేదు. స్నేహితుల మరణం ప్రవీణ్‌ని బాగా కలిచివేసింది. తాగుడుని అరికట్టడానికి నేనేమీ చేయలేనా అని ఆలోచించాడు. అతనికి ఒక హెయిర్ సెలూన్ షాపు […]
ఒక్కోసారి మార్పువైపు వేసే చిన్న అడుగులు, వినూత్న ఆలోచనలు మంచిఫలితాన్ని తెచ్చిపెడతాయి. గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో నివసించే ప్రవీణ్ కూడా అలాంటి ఆలోచనలే చేశాడు. అతని స్నేహితులు ముగ్గురు మద్యం అలవాటుకి బానిసలై, అనారోగ్యాలతో మరణించారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రవీణ్‌కి ఉన్నా తానూ పేదవాడు కావడం వలన అది సాద్యం కాలేదు. స్నేహితుల మరణం ప్రవీణ్‌ని బాగా కలిచివేసింది. తాగుడుని అరికట్టడానికి నేనేమీ చేయలేనా అని ఆలోచించాడు. అతనికి ఒక హెయిర్ సెలూన్ షాపు ఉంది. తనకి వీలైనంత సహాయం చేయాలంటే, తాను చేస్తున్న వృత్తినే ఆధారం చేసుకోవాలని అనుకున్నాడు.
తన షాపుకి వచ్చేవారికి మద్యం, సిగరెట్ అలవాటు ఉంటే వాటిని మానుకొమ్మని చెబుతున్నాడు. అలా మానేస్తామని మాట ఇస్తే తాను వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని ప్రవీణ్ ఆశ చూపుతున్నాడు. అంతేకాదు, మూడునెలల పాటు అలవాటు మానేశాక వారు ఆరోగ్యంగా, ఆనందంగా లేకపోయినా, వారికి ఇంకా తాగాలనిపించినా జీవితాంతం వారి తాగుడు ఖర్చుని తానే భరిస్తానని మాట ఇస్తున్నాడు. ఇప్పటివరకు 15మందితో అతను వ్యసనాలు మాన్పించాడు. వారంతా ప్రవీణ్‌ని తమ డాక్టరుగా, అతని షాపుని తమకు పునరావాస కేంద్రంగా భావిస్తుంటారు. మానలేకపోతే వారి అలవాటు ఖర్చులు జీవితాంతం భరిస్తానని తాను చెబుతున్నా ఇంతవరకు అలాంటి అవసరం రాలేదని, మద్యం మానేసిన వారు తన సహాయం తీసుకోవాల్సిందిగా ఇతరులకు కూడా సలహా ఇస్తున్నారని ప్రవీణ్ అంటున్నాడు. మనసుంటే ఏదోఒక మార్గముంటుంది అనడానికి ప్రవీణ్ ఒక ఉదాహరణ.